నరేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి.. చేయించింది వారే అంటూ నరేష్ పిర్యాదు

సీనియర్ నటుడు నరేష్ మరోసారి కొత్తవివాదంతో వార్తల్లో నిలిచారు. ఇప్పటికే ఆయన మాజీ భార్య రమ్య తనపై కుట్రలు పన్నుతోంది అని తనపై దాడి చేయించేందుకు కూడా ఆమె ప్రయత్నాలు చేస్తుంది అని నరేష్ ఆరోపించాడు. అంతేకాకుండా తనకు ప్రాణహాని కూడా పొంచి ఉంది అనే ఆరోపణలు చేసిన నరేష్ రమ్య రఘుపతి తో మళ్లీ నాకు జీవితాన్ని కొనసాగించాలని లేదు అని నరేష్ ఒక వీడియో ద్వారా కూడా వివరణ ఇచ్చాడు.

ఇక ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది అని త్వరలోనే విడాకులు కూడా వస్తాయి అని ఆయన తెలియజేశారు. అయితే ఈ తరుణంలో ఎప్పుడైనా కూడా రమ్య నాపై దాడి కూడా చేయించే అవకాశం ఉంది అని నరేష్ తెలియజేశాడు. ఇక ఇంతలోనే నరేష్ ఇంటిపై ఆదివారం రోజు కొంతమంది దాడి చేయడం చర్చనీయాంశంగా మారింది. నరేష్ క్యారావాన్ తో పాటు ఇతర వాహనాల అద్దాలను కూడా దుండగులు ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది.

Unexpected attack on senior actor naresh house police complaint filed

అయితే దాడి చేయడానికి వచ్చిన వారు ఎవరో తనకు తెలియదని చెప్పిన నరేష్ కచ్చితంగా దాడి చేయించింది మాత్రం తన మాజీ భార్య రమ్య అని నరేష్ ఆరోపించాడు. అంతే కాకుండా ఆయన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు కూడా చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి అని రమ్య రఘుపతి నుంచి నాకు ప్రాణహాని పొంచి ఉంది అని ఆయన కంప్లైంట్ల వివరణ ఇచ్చారు.

ఇక గత కొంతకాలంగా నరేష్ పవిత్ర లోకేష్ కు సంబంధించిన పెళ్లి వార్తలు జోరుగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే అప్పటినుంచి నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి తో నరేష్ కు గొడవలు ఎక్కువవుతున్నాయి. ఇక ఈ విషయంపై నరేష్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అలాగే గత శనివారమే నరేష్ తనపై అలాగే పవిత్ర లోకేష్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఇక ఇంతలోనే ఆయన ఇంటి పై దాడి జరగడం వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X