twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Happy Birthday Ilaiyaraaja: సుస్వరాల మాంత్రికుడు 'ఇళయరాజా'.. ఆసియా ఖండంలోనే ఆ ఘనత పొందిన తొలివ్యక్తి!

    |

    ఇళయరాజా అనే పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు అనడం అతిశయోక్తి కాదు. సినీ సంగీతానికి కొత్త వన్నె తెచ్చి తన విభిన్నమైన సంగీతంతో సినిమా పాటలతో కొత్త పుంతలు తొక్కించిన మహా సంగీత జ్ఞానిగా నిలిచిన ఆయన చిత్ర పరిశ్రమలో ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు ఆయన. దాదాపు స్టార్ హీరోల సినిమాలకు మ్యూజిక్ అందించిన ఆయన పుట్టిన రోజు నేడు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..

     గ్రామంలో పుట్టి

    గ్రామంలో పుట్టి

    1943 జూన్ 2 న తమిళనాడులోని తేని జిల్లా, పన్నైపురం గ్రామంలో.. రామస్వామి, చిన్న తాయమ్మాల్ దంపతులకు మూడో కుమారుడుగా జన్మించాడు ఇళయరాజా. గ్రామంలో పెరగడం వల్ల పొలాల్లో రైతులు పాడుకునే పాటలతో జానపద సంగీత పరిచయం అయింది. స్కూల్ లో జాయిన్ చేసేటప్పుడు జ్ఞాన దేశికన్ పేరును ఆయన తండ్రి రాజయ్య అని మార్పించారు. ఇక తరువాత సంగీతం నేర్చుకోవడానికి ధనరాజ్ మాస్టర్ దగ్గర చేరినప్పుడు ఆయన ఆ పేరును రాజాగా మార్చారు.

    గిటారిస్ట్ గా అవకాశమిస్తే చాలు

    గిటారిస్ట్ గా అవకాశమిస్తే చాలు

    ఇక నిజానికి మొదట్లో తనకు గిటారిస్ట్ గా అవకాశమిస్తే చాలు, ఆ రోజు కడుపు నింపుకోవచ్చని భావిస్తూ ఎందరో సంగీత దర్శకుల చుట్టూ తిరిగేవారు ఇళయరాజా. ముందుగా కన్నడ సీమలో సెటిలయిన సంగీత దర్శకుడు వెంకటేష్ వద్ద తమిళ తంబీ ఇళయరాజాకు అవకాశం లభించింది. వెంకటేష్ అనేక తెలుగు, కన్నడ చిత్రాలకు సంగీతం సమకూర్చారు. ఆయన దగ్గర గిటారిస్ట్ అవకాశం దక్కించుకున్న ఆయన వెంకటేష్ వద్ద పలు చిత్రాలకు పనిచేసి తమిళ్ సినిమాతో సంగీత దర్శకుడిగా మారాడు.

     అన్న కిలితో ఎంట్రీ

    అన్న కిలితో ఎంట్రీ

    1976లో సంగీత దర్శకుడిగా తమిళ్ లో మొదటి సినిమా 'అన్న కిలి' చేశారు. అయితే అప్పటిదాకా రాజాగా చెలామణీ అయిన ఆయనను ఆ చిత్ర నిర్మాత అరుణాచలం 'ఇళయ' (తమిళ్ లో చిన్నవాడు) అని పిలిచేవాడు. అలా ఇళయారాజా అని స్క్రీన్ నేమ్ ఫిక్స్ అయిపోయింది. ఇక తెలుగులో వయసు పిలిచింది సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన అనేక సినిమాలకు సంగీతం అందించారు.

    ఆసియా ఖండంలోనే తొలి వ్యక్తి

    ఆసియా ఖండంలోనే తొలి వ్యక్తి

    45 సంవత్సరాల సినిమా జీవితంలో వివిధ భాషలలో దాదాపు 5,000 పాటలకు, 1000 సినిమాలకు పైగా ఆయన సంగీత దర్శకత్వం వహించాడు. 1993లో లండన్ ప్రఖ్యాత రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రా తో ఒక పూర్తి స్థాయి 'సింఫనీ' ని కంపోజ్ చేశారు. ఆసియా ఖండంలో ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

    Recommended Video

    Ilaiyaraaja : Unknown Facts About Ilaiyaraaja
     తెలుగులో అనుబంధం

    తెలుగులో అనుబంధం

    మూడు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా నిలచిన ఇళయరాజాకు రెండు సార్లు తెలుగు చిత్రాల ద్వారా (సాగరసంగమం, రుద్రవీణ) ఆ అవార్డు దక్కడం విశేషం. మొత్తంగా సంగీత దర్శకుడిగా ఐదు జాతీయ అవార్డులు అందుకుంటే మిగిలిన రెండు సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌కు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇళయరాజా ఇద్దరు కుమారులు కార్తీక్ రాజా, యవన్ శంకర్ రాజా, కుమార్తె భవతరిణి ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ సంగీత దర్శకులుగా మారారు. ఇక ఆయన కూడా ఇప్పటికీ రిటైర్ అవకుండా ఇప్పటికీ పలు సినిమాలకి సంగీతం అందిస్తున్నారు.

    English summary
    music maestro Ilaiyaraaja is celebrating his birthday on 2nd June. Here are some unknown facts about music director Ilaiyaraaja.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X