15 నుంచి సినిమా థియేటర్లు ఓపెన్... కానీ కండిషన్ అప్లై.. కేంద్ర మార్గదర్శకాలు ఇలా..
లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో కొన్ని కార్యక్రమాలకు అనుమతులిస్తూ, మరికొన్ని విషయాల్లో సడలింపులు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి కొన్ని సంస్థలకు, వినోద రంగానికి చెందిన మాల్స్, సినిమా హాళ్లకు ఆంక్షలతో కూడిన సడలింపులు ఇచ్చింది. అన్‌లాక్ 5.0 ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన ఏమిటంటే..
సినిమా, థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల ఓపెన్‌కు అనుమతులు మంజూరు చేసింది. అయితే సినిమా హాళ్లలో కేవలం 50 శాతం సిట్టింగ్ కెపాసిటీ లేదా 200 మందికి మించకుండా చర్యలు తీసుకోవాలని వాణిజ్య, పన్నులశాఖ సూచించింది. మాస్కులు ధరించడం తప్పనిసరి. సోషల్ డిస్టెన్స్ పాటించాలి. థర్మల్ స్కానింగ్ మిషిన్లు, హ్యాండ్ వాష్ సానిటైజర్లు తప్పనసరి అని మార్గదర్శకాల్లో పేర్కొన్నది.

వినోద రంగానికి సంబంధించిన పార్కులు విషయంలో కూడా 50 శాతం పరిమితితో ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేస్తుందని వెల్లడించారు.
టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేందుకు అడ్వాన్స్ బుకింగ్ ఏర్పాటును సిద్దం చేస్తున్నారు. క్యూలో ప్రేక్షకులు నిలుచోకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. అలాగే థియేటర్‌కు వెళ్లే సమయంలో ఆరోగ్యసేతు యాప్‌ను ఉపయోగిస్తే ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందనే సూచన ఇస్తున్నారు. ప్యాకింగ్ రూపంలో ఉండే తిను బండారాలను మాత్రమే అమ్మడం అనే నిబంధనను అమల్లోకి తెస్తున్నారు. సినిమా హాళ్లలో ఎక్కువ సంఖ్యలో ఫుడ్ కౌంటర్లను ఏర్పాటు చేయాలనే ఆదేశాలను ఆరోగ్యశాఖ వెల్లడించింది.


Click it and Unblock the Notifications











