twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable 2: రెండు భాగాలుగా ప్రభాస్ గోపిచంద్ ఎపిసోడ్.. స్ట్రీమింగ్ డేట్స్ ఎప్పుడంటే?

    |

    నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో స్థాయి ప్రతి ఎపిసోడ్ కు అంతకంతకు పెరుగుతూనే ఉంది. అయితే ఈ సీజన్లో ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ కూడా చాలా హైలెట్ కాబోతున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు అంచనాలను అమంతంగా పెంచేసాయి. ఇక ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారి ఆహా మాత్రం డబుల్ ధమాకా తరహాలో రెండు భాగాలుగా ఎపిసోడ్ ను ప్లాన్ చేసింది. ఇక ఆ రెండు ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతున్నాయి? అనే వివరాల్లోకి వెళితే..

    బాలయ్యతో ప్రభాస్ అల్లరి

    బాలయ్యతో ప్రభాస్ అల్లరి

    నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో పేరుకు తగ్గట్టుగానే మంచి క్రేజ్ అందుకుంటుంది. ఇక ప్రతి ఎపిసోడ్లో కూడా స్టార్స్ అందరూ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపిస్తూ బాలయ్య బాబుతో చేస్తున్న సందడి అంతా కాదు. ఇక ప్రభాస్ గోపీచంద్ కూడా చాలా అల్లరి చేశారు అని ఇప్పటివరకు విడుదలైన ప్రోమోలు రుజువు చేశాయి ముఖ్యంగా గోపీచంద్ కూడా ఈ షోలో హైలెట్ గా నిలవబోతున్నట్లు అర్థమవుతోంది.

     న్యూ ఇయర్ సందర్భంగా

    న్యూ ఇయర్ సందర్భంగా

    అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ కు సంబంధించిన ప్రతి ఎపిసోడ్ కూడా హైలెట్ అవుతోంది. ఇక ప్రభాస్ గోపీచంద్ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితం పూర్తయింది. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఎపిసోడ్ ను విడుదల చేస్తున్నట్లుగా ఇటీవల టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆహా నుంచి అధికారికంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది.

    మొదటి ఎపిసోడ్ ఎప్పుడంటే..

    మొదటి ఎపిసోడ్ ఎప్పుడంటే..

    అయితే ఈసారి అన్ స్టాపబుల్ షో సరికొత్తగా ఒకే ఎపిసోడ్ ను 2 భాగాలుగా చూపించడానికి రెడీ అయ్యారు. అయితే ఒక్కొక్కదానికి చాలా గ్యాప్ కూడా ఇస్తున్నట్లు అర్థమవుతుంది. ఇక దీనిని బాహుబలి రేంజ్ లో అయితే హైలైట్ చేస్తున్నారు. ముందుగా బాహుబలి ఎపిసోడ్ పార్ట్ 1 ద బిగినింగ్ అంటూ డిసెంబర్ 30వ తేదీన స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు క్లారిటీ చేశారు.

    రెండవ ఎపిసోడ్

    రెండవ ఎపిసోడ్

    కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వలన ఎక్కడ కూడా ఎడిట్ చేయవద్దు అని ఆహా ఈ నిర్ణయం తీసుకుందట. దీంతో ఎపిసోడ్ షూటింగ్ మొత్తాన్ని కూడా ఎక్కడ డిలీట్ చేయకుండా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక బాహుబలి ఎపిసోడ్ పార్ట్ టు ది కంక్లూజన్ అనే టైటిల్ తో మరొక ఎపిసోడ్ ను 2023 జనవరి 6వ తేదీన స్ట్రీమింగ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. అందుకు సంబంధించిన అఫీషియల్ డేట్స్ కూడా వచ్చేసాయి.

    మాహిష్మతి ఊపిరి పీల్చుకో..

    మాహిష్మతి ఊపిరి పీల్చుకో..

    కంటెంట్ ఇంత బాగుంది అంటే ఎడిట్ చేయడానికి ఎవరూ ఒప్పుకోలేదు. అదే ఎక్స్ క్లూజివ్ ఎక్స్ పీరియన్స్ మీకు అందించేందుకు డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేయడానికి ఈ రెండు భాగాలు విడుదల చేయబోతున్నట్లుగా ఆహా అధికారికంగా తెలియజేసింది. మాహిష్మతి ఊపిరి పీల్చుకో అంటూ బాహుబలి రెండు భాగాలుగా రాబోతోంది అని అనౌన్స్ చేశారు. దీంతో ఈ ఇయర్ తో పాటు సంక్రాంతి కూడా ఆహాకు భారీ స్థాయిలో క్రేజ్ అందే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది.

    English summary
    unstoppable 2 prabhas gopichand episode in two parts and streaming date..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X