కేజీఎఫ్ 2: ‘అధీరా’ పాత్రలో ఎవరో తెలుసా?
కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'కెజిఎఫ్-1' బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. కన్నడ సినీ పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ 'కెజిఎఫ్ 2' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
తాజాగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ... పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అధీరా విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాత్రలో కనిపించేది ఎవరు? అనేది వెల్లడిస్తూ జులై 29న ఉదయం 10 గంటలకు పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు.

'కెజిఎఫ్ 2' ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టే అవకాశం ఉందని టాక్. 'అధీరా' పాత్రలో కనిపించేది ఆయనే అనే కావొచ్చనే ప్రచారం జరుగుతోంది. సంజయ్‌తో పాటు రవీనా టండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. జులై 29న దీనిపై క్లారిటీ రానుంది.
'కెజిఎఫ్' సాండల్ వుడ్ ఇండస్ట్రీలో సంచలనం క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు అక్కడ వంద కోట్ల రికార్డు కూడా ఒక్కటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 200 కోట్లకుపైగా వసూలు చేసిన చరిత్ర సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్ కిరంగదూర్ నిర్మాత.


Click it and Unblock the Notifications











