మీకా ధైర్యముందా..! అని సవాలు చేస్తున్న మెగా కోడలు

మెగాస్టార్ కోడలుగా కాకుండా... ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకన్న ఉపాసనా కామినేని పదునైన ట్వీట్లకు పెట్టింది పేరు. సూటిగా కుండ బద్దలుగొట్టినట్లు మాట్లాడేసే ఉపాసన ఆ విషయంలో ఇతరులను ఛాలెంజ్ చేసేందుకూ వెనుకాడదు. ముఖ్యంగా ఆరోగ్య పరమైన సూచనలు ఇచ్చేందుకు ఉపాసన అసలు మొహమాట పడదని ఇప్పటికే ఆమె వీడియోల ద్వారా నిరూపితమైంది. ఇక అమ్మడి తాజా ట్వీట్ ఇండస్ట్రీ జనాలనే నోరెళ్లబెట్టేలా చేసింది.

ఇంతకూ విషయం ఏమిటంటే కోవిడ్ కాలంలో వ్యర్థపదార్థాలను రీసైకిల్ చేసే బృహత్తరమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది ఉపాసన. చెప్పడమే కాదు దాన్ని ఆచరణలోనూ పెట్టి చూపించే టైపు అమ్మడు. అందుకే అనుకున్నదే తడువు చక్కగా టెక్స్టైల్ స్క్రాప్ నుంచి తయారు చేసిన షర్ట్ తో పాటూ, డిఫెక్టెడ్ కండోమ్ లతో తయారు చేసిన స్కర్ట్ ను తానే ధరించి ఫొటో షూట్ కూడా చేయించుకుంది.
నిజం చెప్పాలంటే ఈ డ్రెస్ లో ఉపాసన ఏంజెల్ లా ఉందని ఒప్పుకోవాల్సిందే.

Upasana hits it again- wears a dress made out of condoms

ముఖ్యంగా... ఇలా డిఫెక్టెడ్ కండోమ్స్ తో తయారు చేసిన డ్రెస్ వేసుకోవడానికి ఏ హీరోయిన్ కూడా ఒప్పుకోదు. ఇక పబ్లిసిటీతో ఏమాత్రం పనిలేని ఉపాసన ఈ పనికి పూనుకోవడం వెనుక, ఎకో ఫ్రెండ్లీ వస్తువుల పట్ల ఆమె కమిట్మెంట్ ను తెలియజేస్తోంది. ఎంతైనా ఉపాసన ధైర్యానికి మెచ్చుకోని వాళ్లు ఎవరూ ఉండరు. మరి ఆమె ఛాలెంజ్ ను ఎవరైనా స్వీకరిస్తారేమో చూడాలి.

More from Filmibeat

Read more about: upasana kamineni
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X