twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ సతీమణి ఉపాసన రిక్వెస్ట్.. ఎవరూ పట్టించుకోవట్లేదంటూ మెసేజ్

    |

    సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండే సెలెబ్రిటీల్లో ఎప్పుడూ ముందుంటుంది రామ్ చరణ్ సతీమణి ఉపాసన. ఎప్పటికప్పుడు తన విశేషాలు, రామ్ చరణ్ సినిమా సంగతులు, అలాగే సోషల్ వర్క్ లాంటి ఎన్నో అంశాలపై పోస్టులు పెడుతూ అందరికీ ఆదర్శంగా ఉండటం ఈమె స్టైల్. అదే బాటలో కొత్త సంవత్సరం వస్తుండటంతో కొన్ని రోజుల ముందుగానే అందరికీ అలర్ట్ చేసింది ఉపాసన. ఇంతకీ ఏంటా అలర్ట్? వివరాల్లోకి పోతే..

    న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పూలు, బొకేలు

    న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పూలు, బొకేలు

    న్యూ ఇయర్ వచ్చిందంటే చాలు దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటుంది. ఎవరికీ వారు తమ తమ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ మేరకు ఆ శుభాకాంక్షల్లో భాగంగా బొకేలు ఇచ్చుకుంటారు. అదే విధంగా ఇళ్లను పూలతో అందంగా డెకరేట్ చేసుకుంటారు.

    ఉపాసన రిక్వెస్ట్..

    ఉపాసన రిక్వెస్ట్..

    పూలతోనే కొత్త సంవత్సరం సందర్బంగా ఇంటికి కొత్త అందం తెస్తుంటారు జనం. పువ్వులను విరివిగా వాడుతూ కొన్ని వేస్ట్ కూడా చేస్తుంటారు. ఇది ఎక్కడనైనా సాధారణంగా గమనించే అంశమే. సరిగ్గా ఈ అంశాన్నే తీసుకొని న్యూ ఇయర్ సందర్బంగా అందరినీ రిక్వెస్ట్ చేసింది రామ్ చరణ్ సతీమణి ఉపాసన.

    వృధాగా పడేసిన పూలను ఇలా చేయండి

    వృధాగా పడేసిన పూలను ఇలా చేయండి

    పూలంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొంటూ, పూలతో చేసిన అలంకరణ, డెకరేషన్ కూడా తనకు ఎంతగానో ఆనందాన్ని ఇస్తుందని తెలిపింది ఉపాసన. అయితే అలా వాడిన పూలను ఆ తర్వాత వృధాగా పడేయడం పట్ల తనకు ఓ క్లారిటీ వచ్చింనద్నారు. పూల ద్వారా ఉత్తత్తి అయ్యే వేస్టేజ్‌ను రీసైక్లింగ్ చేయండన్నారు.

    వాడతారు.. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు

    వాడతారు.. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు

    హోలి వేస్ట్ అనే స్టార్టప్ కంపెనీ వారంలో మూడు సార్లు వందల కిలోల పూల వేస్టేజ్‌ను సేకరిస్తుందని ఈ సందర్బంగా ఉపాసన తెలిపారు. ప్రతీఒక్కరూ ఏదో ఒక సందర్భంలో పూలను వాడుతుంటారు. కానీ వాటి ద్వారా మనం ఉత్పత్తి చేసే వృధాను మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. దయచేసి మీరు కూడా పూలను వృధా చేయకండి అని పేర్కొన్నారు ఉపాసన.

    ఉపాసన కొణిదెల.. ఇదీ మెసేజ్

    ఉపాసన కొణిదెల.. ఇదీ మెసేజ్

    పువ్వులు, మాలికల్ని ఎండబెట్టి రీ సైక్లింగ్ చేయడం ద్వారా దూప్ స్టిక్స్ లేదా అగరబత్తీలు తయారు చేయొచ్చని చెప్పారు ఉపాసన. అంతేకాదు ఈ ప్రక్రియ చాలా సులువు అని కూడా తెలిపారు. తనకు కూడా పూలంటే ఎంతో ఇష్టమని, ప్రకృతికి అనుకూలంగా ఆ పూలను ఎక్కువగా వృధా చేయకండి అంటూ ఇలా న్యూ ఇయర్‌ మెసేజ్ పాస్ చేశారు ఉపాసన కొణిదెల.

    English summary
    Upasana Kamineni shared a social message and requesting all the people. She says about importence of flowers in our life.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X