twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్‌ పై ఉపాసన కామెంట్.. సమంత కూడా ఎంటరై! వైరల్ ట్వీట్స్

    |

    సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండే సెలెబ్రిటీల్లో ముందు వరుసలో ఉంటారు కొణిదెల కోడలు ఉపాసన, అక్కినేని కోడలు సమంత. ఎప్పటికప్పుడు తమ, తమ కుటుంబ అప్‌డేట్స్ ఇస్తూ రావడంలో ఈ ఇద్దరికీ సాటిరారెవ్వరు. ఈ ఇద్దరిలో ముఖ్యంగా ఉపాసన అయితే ఏకంగా యూ ట్యూబ్ ఛానెల్ పెట్టేసి పలు వీడియోలతో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో యూ ట్యూబ్ సంస్థ ఉపాసన సేవలు గుర్తించి ప్రత్యేక మొమెంటో ఇచ్చింది. దీనిపై స్పందించిన ఉపాసన ఓ ట్వీట్ పెడుతూ రామ్ చరణ్ పేరు ప్రస్తావించింది. వివరాల్లోకి పోతే..

     ఉపాసన సహకారం.. ముఖ్యంగా దానిపై ఫోకస్

    ఉపాసన సహకారం.. ముఖ్యంగా దానిపై ఫోకస్

    బేసిక్‌గా ఉపాసన సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో సినీ ఇండస్ట్రీ జోలికి రాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటోంది. మెగా కోడలిగా మెప్పు పొందుతూ పలు సామాజిక అంశాల పట్ల తన వంతు సహకారం అందిస్తోంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ హెల్త్‌కి సంబంధించి పలు సూచనలు, జాగ్రత్తలు ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆరోగ్యం విలువ తెలుపుతుంది ఉపాసన.

    అందరిలో స్ఫూర్తి నింపుతూ ఆ దిశగా మెగా కోడలు

    అందరిలో స్ఫూర్తి నింపుతూ ఆ దిశగా మెగా కోడలు

    ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఉపాసన ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి 'బీ పాజిటివ్' అనే మ్యాగజైన్‌ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది. ఈ మేరకు ‘బిపాజిటివ్ విత్ ఉపాసన' పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్‌ ప్రారంభించి పలువురు సెలెబ్రిటీల చేత హెల్త్ టిప్స్ చెప్పిస్తూ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తోంది.

     జనాల్లో అవగాహన నింపుతూ ఉపాసన అడుగులు

    జనాల్లో అవగాహన నింపుతూ ఉపాసన అడుగులు

    పలువురు సెలెబ్రిటీల ఫిట్‌నెస్ సీక్రెట్స్ చెబుతూ ఆరోగ్య సూచనలు ఇప్పించడం ఉపాసన యూ ట్యూబ్ ఛానెల్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా ఇప్పటికే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ లేడీ స్టార్ సమంత, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, కత్రినా కైఫ్ లాంటి ఎందరితోనో ఫిట్‌నెస్ పాఠాలు ఇప్పించి బీ పాజిటివ్ అంటూ జనాల్లో పాసిటివిటీని పెంచుతోంది ఉపాసన.

    ఉపాసన సిల్వర్ ప్లగ్ మొమెంటో

    దీంతో ఉపాసన ప్రారంభించిన ఈ యూట్యూబ్ ఛానల్ కి బాగా ఆదరణ పెరిగింది. ఏకంగా లక్ష సబ్‌స్క్రయిబర్లను సొంతం చేసుకోవడంతో యూట్యూబ్ టీమ్ ఉపాసనను ప్రత్యేకంగా అభినందించింది. ఈ మేరకు సిల్వర్ ప్లగ్ మొమెంటోను బహూకరించింది.

    దీనంతటికీ కారణం రామ్ చరణ్.. సమంత కామెంట్

    దీనంతటికీ కారణం రామ్ చరణ్.. సమంత కామెంట్

    తనకు వచ్చిన ఈ సిల్వర్ ప్లగ్ మొమెంటోను మెగా అభిమానులకు చూపిస్తూ ట్వీట్ చేసింది ఉపాసన. ఈ సందర్బంగా ఈ మైలురాయికి చేరుకోవడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ.. దీనంతటికీ ప్రేరణ మిస్టర్ సి (రామ్ చరణ్) అని పేర్కొంది ఉపాసన. ఆమె చేసిన ఈ ట్వీట్ చూసి సమంత స్పందిస్తూ ప్రత్యేక సమంత అభినందలు తెలిపింది.

    English summary
    Upasana Kamineni shared a tweet On her twitter. She says about her feet and comment as ''This milestone is marked with extreme gratitude. Thank you YouTube. This really means a lot to me. U’ll know why, very soon.I thank Mr C for always inspiring me''.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X