Upasana Kamineni సింహపు పిల్లల్ని దత్తత తీసుకొన్న రాంచరణ్ సతీమణి.. వాటి పేర్లు, ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ సతీమణి, అపోలో హాస్పిటల్‌లో కీలక బాధ్యతలు పోషిస్తున్న ఉపాసన కామినేని మరోసారి అందరికి స్పూర్తిగా నిలిచే బాధ్యతను భుజానికి ఎత్తుకొన్నారు. ఇప్పటికే జంతు ప్రేమికురాలిగా ఎన్నోసార్లు నెటిజన్లను, సాధారణ ప్రజలను ఆకట్టుకొన్న మెగా కోడలు ఇప్పుడు రెండు సింహాపు పిల్లలను దత్తతగా తీసుకొన్నారు. ఆసియాకు చెందిన మేలుజాతి సింహపు పిల్లలను దత్తత తీసుకొన్న విషయాన్ని ఉపాసన తరఫున హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికలక్ పార్క్‌ నిర్వాహకులు వెల్లడించారు.

ఉపాసన దత్తత విషయాన్ని నెహ్రూ జూ అధికారులు బాహ్య ప్రపంచానికి వెల్లడిస్తూ.. రెండు సింహపు పిల్లలను సంరక్షణను భుజానికి ఎత్తుకొన్నారు. వాటి బాధ్యతను ఆమె చూసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ సింహపు పిల్లలకు అవసరమయ్యే ఆహారం, మెయింటెనెన్స్‌కు సంబంధించిన విషయాలను ఆమె స్వయంగా చూసుకొంటారు. ఆ సింహ పిల్లలకు వికీ, లక్ష్మీ అనే పేర్లు పెట్టారు.

Upasana Kamineni Konidela adopts two Asian lion cubs at the Nehru Zoological Park in Hyderabad

నెహ్రూ జులాజికల్ పార్కులోని రెండు సింహపు పిల్లల సంరక్షణ కోసం క్యూరేటర్ ఎస్ రాజశేఖర్‌‌కు రూ.2 లక్షల రూపాయల చెక్‌ను అందించారు. కొన్ని అరుదైన జంతువులు అంతరించిపోతున్న నేపథ్యంలో వాటి సంరక్షణ కోసం బాధ్యత తీసుకోవాలని అనుకొన్నాను. వాటికి అసరమయ్యే ఆహారం, మెడికల్ వసతులను గురించి కేర్ తీసుకోవాలని నెహ్రూ జులాజికల్ పార్క్ నిర్వాహకులు, అధికారులను కలిశాను. వారు సానుకూలంగా స్పందించడంతో రెండు సింహపు పిల్లలను దత్తత తీసుకొన్నాను అని ఉపాసన మీడియాకు తెలిపారు.

ఈ సందర్భంగా జూ అధికారులను, సిబ్బందిని ఉపాసన కొణిదెల ప్రశంసలతో ముంచెత్తారు. దాదాపు 200కుపైగా జంతువుల కోసం తీసుకొంటున్న సంరక్షణ చాలా గొప్పగా ఉంది. జంతువుల సంరక్షణ కోసం పాటుపడుతున్న సిబ్బందిని అంకితభావం చాలా బాగుంది అని ఉపాసన అన్నారు.

ఉపాసన విషయానికి వస్తే.. అపోలో హాస్పిటల్‌లో కీలక బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా సామాజిక సేవలో నిమగ్నమవుతున్నారు. అలాగే జంతువుల సంరక్షణ తదితరల విషయాలపై ఆమె దృష్టిపెట్టి ప్రజల ప్రశంసల అందుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X