భార్య, కూతురిపై రామ్ చరణ్ స్పెషల్ వీడియో రిలీజ్.. ఉపాసన ఏంటి అలా అనేసింది?

టాలీవుడ్ లో లవ్లీ కపూల్స్ లో రామ్ చరణ్, ఉపాసన ఒకరు. అయితే ఇటీవల వీరు ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ మెగా ప్రిన్సెస్ కు క్లిం కారా అనే పేరును కూడా పెట్టారు. అయితే ఈరోజు ఉపాసన పుట్టిన రోజు. మరోవైపు క్లీంకార పుట్టి సరిగ్గా నెలరోజులు అయింది. దీనితో రామ్ చరణ్, ఉపాసన కలిసి క్లిన్ కారా రాక గురించి హృదయాన్ని కదిలించే వీడియోను చిత్రీకరించారు. ఇందులో రామ్ చరణ్, ఉపాసన, చిరంజీవి, సురేఖ.. మాట్లాడారు. ఆ వివరాల్లోకి వెళితే...

మెగా ఇంట సంబరాలు రెట్టింపు: రామ్ చరణ్, ఉపాసన కొణిదెల పెళ్లైన 11 ఏళ్లకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక ఇటీవల మెగా ఇంట ఓ ఆడపిల్ల అడుగు పెట్టింది. ఇక మెగా కుటుంబంలో సంబరాలు వెల్లువెత్తాయి. ఆ చిన్నారికి చిరంజీవి క్లిం కారా అనే నామాకరణం కూడా చేశారు. ఇక క్లిం కారా అడుగు పెట్టి నేటికి నెల రోజులు అయింది. మరోవైపు ఈరోజు ఉపాసన పుట్టిన రోజు. దీనితో మెగా ఇంట సంబరాలు రెట్టింపు అయ్యాయి.

Upasana Kamineni Konidela Release a Heart-Warming Video Capturing Klin Kaara Konidela Arrival

జోసెఫ్ రాధిక్ డైరెక్షన్: ఉపాసన పుట్టిన రోజు, క్లిం కారా పుట్టి నెల కావడంతో.. వీరికి సంబంధించిన ఓ వీడియోను చిత్రీకరించారు. దీనికి ప్రముఖ చిత్ర నిర్మాత జోసెఫ్ రాధిక్ నిర్మించి, దర్శకత్వం వహించారు. ఇక ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ కొణిదెల.. వీరితో పాటు ఉపాసన తల్లిదండ్రులు శోభన కామినేని, అనిల్ కామినేని ఉన్నారు. క్లీంకార పుట్టిన త‌ర్వాత కుటుంబ స‌భ్యులు, అభిమానులు అంద‌రూ పండుగ చేసుకున్నారు. వాట‌న్నింటినీ వీడియోలో అందంగా చూపించారు.

Upasana Kamineni Konidela Release a Heart-Warming Video Capturing Klin Kaara Konidela Arrival

రామ్ చరణ్ ఫుల్ హ్యాపీ: ఇక ఈ వీడియోలో రామ్ చ‌ర‌ణ్ మాట్లాడుతూ... క్లీంకార పుట్టే స‌మ‌యంలో మా అంద‌రిలోనూ తెలియ‌ని టెన్ష‌న్‌. అంతా స‌రిగ్గా జ‌ర‌గాల‌ని మేం అంద‌రూ ప్రార్థిస్తున్నాం. అందుకు త‌గిన‌ట్టే అన్నీ అనుకూలంగా మారి స‌రైన స‌మ‌యం కుద‌ర‌టంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింద‌ని అనుకుంటున్నా.. పాప పుట్టిన ఆ క్ష‌ణం మ‌న‌సుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్ట‌టానికి ప‌ట్టిన 9 నెల‌ల స‌మ‌యం, అప్పుడు జ‌రిగిన ప్రాసెస్ అంతా త‌లుచుకుని సంతోషంగా ఫీల్ అయినట్లు అని చెప్పుకొచ్చారు.

Upasana Kamineni Konidela Release a Heart-Warming Video Capturing Klin Kaara Konidela Arrival

క్లీంకార పేరు అలా వచ్చిందా: క్లీంకార రాకకు దారి తీసిన ఆ మ‌ర‌పురాని క్ష‌ణాల‌తో పాటు, పాప‌కు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మైన అస‌లు క‌థ‌ను కూడా వీడియోలో చూపించారు. భార‌త‌దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిశా ప్రాంతాల్లో నివ‌సిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారని తెలుస్తోంది. స‌ద‌రు చెంచు జాతి ద్రావిడు సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్ప‌త‌నం, విలువ‌లే పాపకు ఆ పేరు పెట్ట‌టానికి కార‌ణ‌మ‌య్యాయని చెప్పారు

Upasana Kamineni Konidela Release a Heart-Warming Video Capturing Klin Kaara Konidela Arrival

ట్యాగ్ లు వద్దు: ఉపాస‌న కొణిదెల మాట్లాడుతూ ... మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాల‌ని నేను కోరుకున్నాము. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగుల‌ను ఇవ్వ‌కండి. అలాంటి వాటిని వారే స్వ‌యంగా సాధించుకోవాల‌ని నా అభిప్రాయం. పిల్ల‌ల పెంప‌కంలో ఇవి ముఖ్య‌మైన‌వి. జీవితంలో ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించాలి.మ‌నం అంద‌రితో క‌లిసి సంతోషంగా ఉన్న స‌మ‌యానికి విలువ ఇవ్వాల‌ని నేను భావిస్తాను అని చెప్పుకొచ్చింది.

ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా వీడియో ద్వారా ప్రసెంట్ చేయడం.. రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల‌ను నెటిజ‌న్స్ అభినందిస్తున్నారు. మరోవైపు ఉపాసన బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెష్ చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X