దటీస్ ఉపాసన.. కొణిదెల కోడలి మనసంటే ఇదే మరి!!
కొణిదెల కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన మరోసారి తన మనసు చాటుకుంది. సామాజిక సేవలో ఎప్పుడూ ముందుండే ఈమె తాజాగా పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు తన ఫాలోవర్స్ కి దాని పట్ల అవగాహన కల్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది ఉపాసన. వివరాల్లోకి పోతే..

అపోలో లైఫ్ గ్రూప్ చైర్‌పర్సన్.. సామాజిక సేవ
అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపుల చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల సామాజిక సేవలో ముందుంటారనే విషయం అందరికీ తెలిసిందే. బిజినెస్‌లతో బిజీగా ఉండే ఉపాసన సామాజిక సేవ కోసం కూడా సమయాన్ని కేటాయిస్తున్నారు. పేదలకు తనవంతు సాయాన్ని అందిస్తూ వస్తున్నారు.

పేదల కోసం మరో మంచి కార్యక్రమం
సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగమవుతూ సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు ఉపాసన. అందరినీ తమవంతు సాయం అందించాలని కోరుతున్నారు. తాజాగా ఉపాసన పేదల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.

జనం కోసం కూడా ఆలోచించాలంటూ..
మనం మన కోసమే కాకుండా జనం కోసం కూడా ఆలోచించాలంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది ఉపాసన కొణిదెల. మన జ్ఞాపకాలతో ముడిపడనివి, వాడేసిన వస్తువులు, దుస్తులు ఏమైనా ఉంటే వాటిని ఇచ్చే ఏర్పాటు చేయాలంటున్నారామె.

మెగా కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన
అపోలో ఫౌండేషన్, అపోలో లైఫ్ గ్రూపులకు చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే తనవంతు సమాజసేవ చేస్తుండడటం చూస్తున్నాం. ఈ మేరకు ఇప్పుడు మనకు అవసరం లేనివి, వాడేసిన వస్తువులు, దుస్తులను పేదలకు ఇచ్చే ఏర్పాటు చేయాలంటూ ఈ కార్యక్రమం చేపట్టింది ఉపాసన.
ఉపాసన మనసు.. నెటిజన్స్ కామెంట్స్
ఈ మేరకు తన ఇంట్లో వాడకం మొదలుపెట్టి 10 నెలలు దాటిన అలాంటి వస్తువులను జనం కోసం వినియోగించేందుకు సిద్ధమవ్వాలంటూ సోషల్ మీడియా ద్వారా పిలుపునిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. దీంతో ఆమె మంచి మనసు చూసి ‘దటీజ్ ఉపాసన' అంటూ పొగుడుతున్నారు నెటిజన్స్.


Click it and Unblock the Notifications











