మహిళా డాక్టర్ హత్య.. వీడియోతో మేల్కొలిపిన ఉపాసన
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ ఉండే సెలబ్రిటీల్లో ఉపాసన ఒకరు. సినిమాల్లో నటించినప్పటికీ సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది ఉపాసన. రామ్ చరణ్ సతీమణిగా నెటిజన్లకు పరిచయమైన ఈమె తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ కూడగట్టుకుంది. తన భర్తకు సంబంధించిన తాజా అంశాలు, సామాజిక కోణంలో స్పందనలు, హెల్త్ టిప్స్ పంచుకుంటూ ఉండటం ఈమె ప్రత్యేకత.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ లో వెటర్నరీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారంపై స్పందించింది ఉపాసన. షాద్‌నగర్ మహిళా డాక్టర్‌పై జరిగిన లైంగికదాడిపై రియాక్ట్ అయింది ఉపాసన. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్ నుంచి ఓ వీడియోను విడదల చేసింది.

కామాంధుల బారి నుండి పిల్లలను కాపాడటం ఎలా అనే ఒక అంశంపై ఒక వీడియోని సిద్ధం చేసి.. తన ఛానెల్‌లో విడుదల చేసింది ఉపాసన. ప్రజల బాగుకోసమే తనవంతు సాయంగా ఈ పని చేస్తున్నట్లు తెలిపింది. మన సమాజంలో పిల్లలపై నిత్యం జరుగుతున్న అత్యాచారాల నుంచి వాళ్లను వాళ్లు ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై చాలా విషయాలు ఇందులో పొందుపరిచింది ఉపాసన.
ఇలాంటి నీచమైన ఘటనలపై తనవంతు సాయంగా ఉపాసన చేసిన ఈ పనిని భేష్ అని మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. ఇక ఈ మధ్యే.. డెంగ్యూ జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చిట్కాలను కూడా ఓ వీడియో రూపంలో యూట్యూబ్‌లో విడుదల చేసి ప్రజల్లో అవగాహన కల్పించింది మెగా కోడలు. సోషల్ మీడియా వేదికగా సమాజహితం కోసం ఆమె పోస్ట్ చేస్తున్న ఈ వీడియోలు చూసి ఫిదా అవుతున్నారు జనం.


Click it and Unblock the Notifications











