twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒత్తిడికి గురయ్యాన్నంటే చాలు.. వెంటనే ఇలా చేసేస్తా.. ఉపాసన సెన్సేషనల్ పోస్ట్

    |

    ఒత్తిడి, స్ట్రెస్ ప్రతీ ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చోటుచేసుకునే పరిణామమే. వృత్తి పరంగానో లేక అనుకోని సమస్యల తోనో ఒత్తిడికి లోను కావడం జరుగుతుంటుంది. అయితే ఆ ఒత్తిడి నుంచి బయటకు రావడానికి ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ప్రయత్నిస్తుంటారు. ఈ కోవలోనే చిరంజీవి కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన తన ఒత్తిడి నుంచి ఎలా ఉపశమనం పొందుతాననే విషయం తెలుపుతూ పోస్ట్ పెట్టింది.

    మెగా కోడలిగా మెప్పు పొందుతూ

    మెగా కోడలిగా మెప్పు పొందుతూ

    మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన సినిమాలు తప్ప, మిగితా విషయాల్లో యమ యాక్టీవ్. బేసిక్‌గా ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో సినీ ఇండస్ట్రీ జోలికి రాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూ మెగా కోడలిగా మెప్పు పొందుతున్నారు. ముఖ్యంగా ఫుడ్ అండ్ హెల్త్‌కి సంబంధించి పలు సూచనలు, జాగ్రత్తలపై ఎడ్యుకేట్ చేయడంలో ఉపాసన ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది.

    ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ..

    ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ..

    ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఉపాసన.. ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి ‘బిపాజిటివ్' అనే మ్యాగజైన్‌ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది. దీనికి కొనసాగింపుగా ఇటీవలే యూ ట్యూబ్ ఛానెల్ కూడా ప్రారంభించింది ఉపాసన.

    ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు

    కాగా అందరిలానే తానూ కొన్ని సందర్భాల్లో ఒత్తిడిగా ఫీల్ అవుతానని, అయితే ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు.. డెక్స్టర్‌తో కాసేపు ఆదుకుంటానని తెలిపింది ఉపాసన. డెక్స్టర్ (ఉపాసన పెంచుకుంటున్న కుక్క పిల్ల) నా ఒత్తిడిని తగ్గిస్తాడని, ఎప్పుడు ఒత్తిడిగా ఫీల్ అయితే డెక్స్టర్‌ను హత్తుకుంటానని ఆమె పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా డెక్స్టర్‌తో దిగిన పిక్ షేర్ చేసింది.

    సోషల్ మీడియాలో యాక్టివ్

    సోషల్ మీడియాలో యాక్టివ్

    మెగా కోడలు కొణిదెల ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విశేషాలు, తన భర్త రామ్ చరణ్ విశేషాలు మెగా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎల్లప్పుడూ టచ్‌లో ఉంటుంది. ఈ కారణంగానే సోషల్ మీడియాలో ఉపాసనకు భారీ ఫాలోయింగ్ ఉంది.

    English summary
    Upasana Kamineni shred a pic On her instagram. She says ''All set to open, But before that a few cuddles with my darling nephew Dexter the ultimate stress buster''.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X