అచ్చం సాహో లాగే సైరా.. చూడగానే ఉపాసన స్పందన
సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు మెగా ఫ్యామిలీ విశేషాలు పంచుకుంటూ ఉంటుంది మెగాస్టార్ కోడలు ఉపాసన. రామ్ చరణ్, చిరంజీవి అంటే ఎంతో అభిమానించే ఈమె తాజాగా సైరా నరసింహా రెడ్డి పోస్టర్ చూసి మెగా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో 'సైరా నరసింహా రెడ్డి' సినిమా విడుదలను పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు మెగాస్టార్ అభిమానులు. భీమవరంలో 'సైరా' సినిమా విడుదల సందర్బంగా భారీ పోస్టర్ ఏర్పాటు చేశారు. 250 అడుగుల పొడవైన ఈ పోస్టర్ చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు మెగా అభిమానులు. దాదాపు అర కిలోమీటర్ మేర ఈ పోస్టర్ ఉండటం గమనార్హం.

తాజాగా ఈ బ్యానర్ వీడియోను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. భీమవరం అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మెగా కోడలు ఉపాసన. గతంలో ఇలాగే ఇక్కడే ప్రభాస్ హీరోగా వచ్చిన 'సాహో' సినిమాకు కూడా భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. దాన్ని మించేలా తమ సత్తా చాటుతూ సైరా సినిమా భారీ బ్యానర్ ఏర్పాటు చేశారు మెగా అభిమానులు.
కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా 300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది 'సైరా నరసింహా రెడ్డి' మూవీ. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. చిత్రంలో చిరంజీవి లీడ్ రోల్ పోషించగా.. అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కీలకమైన పాత్రల్లో నటించారు. ఈ రోజే (బుధవారం) విడుదలైన ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంటోంది.


Click it and Unblock the Notifications











