కత్రినా కైఫ్‌తో కొణిదెల ఉపాసన.. ఒకే ఫ్రేమ్‌లో!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన.. సినిమాలు తప్ప మిగితా విషయాల్లో యమ యాక్టీవ్. బేసిక్‌గా ఆమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో సినీ ఇండస్ట్రీ జోలికి రాకుండా ఇతర సామాజిక కార్యక్రమాల్లో యాక్టీవ్‌గా ఉంటోంది. మెగా కోడలిగా మెప్పు పొందుతూ పలు సామాజిక అంశాల పట్ల తన వంతు సహకారం అందిస్తోంది.
ముఖ్యంగా ఫుడ్ అండ్ హెల్త్‌కి సంబంధించి పలు సూచనలు, జాగ్రత్తలు ఎప్పుడూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఆరోగ్యం విలువ తెలుపుతుంది ఉపాసన. ఆరోగ్యమే మహాభాగ్యం అని భావించే ఈమె ఫిట్‌నెస్, హెల్త్‌కు సంబంధించి 'బీ పాజిటివ్' అనే మ్యాగజైన్‌ను కూడా నడిపిస్తోంది. ఇందులో ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండే సెలబ్రిటీల ఇంటర్వ్యూలను పబ్లిష్ చేస్తూ పాఠకుల్లో స్ఫూర్తి నింపుతోంది.

ప్రజల నుంచి ఈ మ్యాగజైన్‌కి వస్తున్న ఆదరణ చూసిన ఉపాసన.. ఇక ఆ సెలెబ్రిటీల ఇంటర్వ్యూలను వీడియోల రూపంలో ప్రేక్షకుల ముందుంచాలని డిసైడ్ అయింది. ఈ మేరకు 'బిపాజిటివ్ విత్ ఉపాసన' పేరిట ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించింది. ఈ ఛానెల్ ద్వారా పలువురు సెలెబ్రిటీల ఫిట్‌నెస్ సీక్రెట్స్ చెప్పిస్తోంది ఉపాసన. ఆమె చేస్తున్న ఈ షోకు ఆడియన్స్ నుంచి కూడా మంచి స్పందన లభిస్తోంది.


Click it and Unblock the Notifications











