రంగురాళ్లను నమ్ముతున్న ఉపాసన.. వాటి వాడకంతో ఎంతో మార్పు వచ్చిందట!
మెగా కోడలిగా ఇంటి బాధ్యతలను, అపోలో లైఫ్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తోంది ఉపాసన. సోషల్ మీడియాలో ఉపాసన అందరికీ ఆరోగ్యాన్ని పంచుతూ ఉంటుంది. ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆరోగ్యాన్ని కాపాడుకునే చిట్కాలను చెబుతూ అందరికీ అవగాహన కలిగిస్తూ ఉంటుంది. లాక్ డౌన్ సమయంలోనూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచింది. అంతేకాకుండా చిరంజీవి పిలుపు మేరకు సినీ శ్రామికులందరికీ అపోలో నుంచి ఉచితంగా మందులు వచ్చేలా చూసింది.
ఉపాసన ఈ లాక్ డౌన్ సమయంలో గ్రామీణ వాతావరణాన్ని బాగానే ఎంజాయ్ చేసింది. తండ్రితో కలిసి సేంద్రియ వ్యవసాయాన్ని చేసింది. అయితే ఈ లాక్ డౌన్‌లో ఉపాసన ఇంట విషాదం కూడా జరిగింది. ఉపాసన తాత కన్నుమూయడంతో అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. ఆ మధ్య ఉపాసన కొండజాతి అయిన చెంచుల జీవిన శైలిని దగ్గరుండి పరిశీలించింది. వారికి అవసరమైన వస్తువులను అందించింది.

తాజాగా ఉపాసన ప్రాణిక్ హీలింగ్ అంటూ రంగు రాళ్ల గురించి చెప్పుకొచ్చింది. మన జీవితంలో నెగిటివిటీ దూరం చేసి, మనలోనే బాధల్ని మనమే నయం చేసుకునేంత శక్తిని ఇస్తుందని తెలిపింది. నటనను వదిలేసిన టీవీ యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తన ప్రాణిక్ హీలర్ అని పేర్కొంది. ఆయన తన ప్రాణిక్ హీలర్‌తో ఎందరి బాధలనో నయం చేశారని తెలిపింది. మనలోని బాధలు, ఆరోగ్యం, మానసిక సంబంధిత విషయాలు చక్రాలపై ఆధారపడి ఉంటాయి. విల్ పవర్, పాటిటివ్ ఎనర్టీయే మంచి మందులాంటివి. వీటన్నంటికీ తానే ప్రత్యక్ష సాక్షినని తెలిపింది. తాను ఈ ప్రాణిక్, క్రిస్టల్ హీలింగ్‌ను నమ్ముతున్నానని పేర్కొంది.


Click it and Unblock the Notifications











