Upasana Konidela: ఉపాసన కొణిదెల రేర్ ఫీట్.. అలాంటి విక్టరీ కొట్టిన మెగా కోడలు
మెగా కుటుంబానికి జీవితంలో మరపురాని ఆనందాన్ని అందించారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన. ఇటీవల కవల పిల్లలకు జన్మనివ్వడంతో పాటు మెగా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేలా రామ్ చరణ్‌కు వారసుడిని అందించారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిన్నారులకు శివరామ్ కొణిదెల, అన్వీరా దేవి కొణిదెల అని నామకరణం చేసి మురిసిపోతోంది మెగా ఫ్యామిలీ. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన దంపతులు పిల్లలతో ఎంజాయ్ చేస్తూనే తమ రోజువారీ వ్యవహారాల్లో తిరిగి బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఉపాసన రేర్ ఫీట్ సాధించారు. ఈ వివరాల్లోకి వెళితే..
దేశంలోని ప్రముఖ హెల్త్ కేర్ అండ్ హాస్పిటల్ గ్రూప్ అయిన అపోలో హాస్పిటల్స్ ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవరాలే ఉపాసన. ఆమె తల్లిదండ్రులు శోభన కామినేని, అనిల్. లండన్‌లో చదువుకున్న ఉపాసన.. ఆ తర్వాత తమ కుటుంబ వ్యాపారాల బాధ్యతను తీసుకున్నారు. ముఖ్యంగా అపోలో ఆసుపత్రి విస్తరణలోనూ కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ పాలసీ వైస్ ఛైర్మన్‌గా.. URLife డిజిటల్ హెల్త్ కేర్ ఫ్లాట్‌ఫాం ఫౌండర్‌గా, బీ పాజిటివ్ మ్యాగజైన్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఓ స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఉపాసనతో రామ్ చరణ్‌కు తొలిసారి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. సుధీర్ఘకాలం ప్రేమాయణం తర్వాత పెద్దల అంగీకారంతో 2011 డిసెంబర్ 11న రామ్ చరణ్- ఉపాసనల నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. అనంతరం 2012 జూన్ 14న రామ్ చరణ్ - ఉపాసనల పెళ్లి ఘనంగా జరిగింది. 2023 జూన్‌లో ఉపాసన - రామ్ చరణ్ దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి క్లీం కార అనే నామకరణం చేశారు. ఇక గతేడాది దీపావళికి రామ్ చరణ్ - ఉపాసనలు మరోసారి తల్లిదండ్రులం కాబోతున్నట్లు గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ ఏడాది జనవరి 31న కవల పిల్లలకు ఉపాసన జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఉపాసన తన వ్యక్తిగత విషయాలతో పాటు పలు అంశాలపైనా స్పందిస్తుంటారు. స్త్రీ హక్కులు, మహిళా సాధికారిత విషయంలోనూ ఉపాసన తన అభిప్రాయాలు పంచుకుంటూ ఉంటారు. బిజినెస్‌ఉమెన్‌గా, మెగా ఫ్యామిలీ కోడలిగా బాధ్యాతయుతమైన స్థానంలో ఉన్న ఉపాసన ఏం చేసినా, ఏం మాట్లాడినా సమాజంపై పెను ప్రభావం చూపుతుంది. అందుకే తన ఆలోచనలు, అభిప్రాయాలను ఆచితూచి స్పందిస్తుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తన వంతు సాయం చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, అనాథాశ్రమాలకు విరాళాలు అందిస్తున్నారు. మహిళాలకు చేదోడుగా ఉంటూ పలు అంశాల్లో అవగాహన కల్పించే ట్రస్ట్‌లకు అండగా నిలుస్తున్నారు.
ఇక బిజినెస్ విషయంలోనూ ఉపాసన దూసుకెళ్తున్నారు. ఆమె సారథ్యంలో అపోలో ఫార్మసీ భారతదేశంలోనే అతిపెద్ద ఫార్మసీ నెట్‌వర్క్‌గా ఎదిగింది. తాజాగా ఈ ఫార్మసీ అరుదైన ఘనతను అధిగమించింది. తెలంగాణలో 1000వ స్టోర్‌ను ఏర్పాటు చేసి దానిని ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభించారు ఉపాసన. తెలంగాణలో 1000వ ఫార్మసీ స్టోర్‌ను ప్రారంభించిన నేపథ్యంలో ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని పంచుకున్నారు. దీనితో కలిపి దేశంలో అపోలో ఫార్మసీల సంఖ్య 7 వేలకు చేరిందని ఉపాసన తెలిపారు. 27 రాష్ట్రాల్లో.. 285 జిల్లాల్లో 1200కు పైగా సీటీలు, పట్టణాలలో 19000 పిన్ కోడ్‌లను కవర్ చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో గృహిణిగా, బిజినెస్ ఉమెన్‌గా దూసుకెళ్తున్న ఉపాసనపై మెగా అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











