twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణలో కరోనా కలకలం.. మెగా కోడలు కామెంట్ ఏంటంటే..?

    |

    ప్రపంచాన్ని గడగడ వణికిస్తోంది కరోనా వైరస్. చైనాలో మొదలైన కరోనా ధాటికి వివిద దేశాల్లో జనాలు పిట్టల్లా రాలుతున్నారు. మన దేశంలో కేరళలో మొట్టమొదటి కేసును గుర్తించారు. ఇక తాజాగా తెలంగాణలోనూ తొలి కరోనా కేసు నమోదైంది. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. అయితే తెలంగాణలో కరోనా రావడంతో ఇక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మెగా కోడలు, ఉపాసన కొన్ని సూచనలు, కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది.

    Recommended Video

    Corona Virus India : Upasana Konidela Comments On Corona Virus In Telangana
    ఫుల్ బిజీగా ఉపాసన

    ఫుల్ బిజీగా ఉపాసన

    సామాజిక సేవలో ముందుండే ఉపాసన.. అపోలో హెల్త్ కేర్‌లో కీలక బాధ్యతలను నిర్వహిస్తుంది. ఓ వైపు అపోలో బాధ్యతలు, మరోవైపు మెగా కోడలిగా బిజీ, ఇంకోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ సామాజిక సమస్యలపై స్పందించడం ఇలా ఉపాసన క్షణం తీరిక లేకుండా గడిపేస్తూ ఉంటుంది.

    ఆయుర్వేద పద్దతుల్లో..

    ఆయుర్వేద పద్దతుల్లో..

    మన ప్రాచీనపు ఆయుర్వేద పద్దతులను మళ్లీ గుర్తు చేస్తూ.. ప్రజలకు ఆరోగ్య సూచనలు చెబుతూ ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి వాటికి యాంటీ బయాటిక్స్ లాంటి వేసుకోవద్దని.. ఆయుర్వేద చిట్కాలపై అవగాహన కలిగిస్తూ ఉంటుంది.

    ఇంట్లోని వస్తువులతోనే..

    ఇంట్లో దొరికే వస్తువులతోనే ఆరోగ్య చిట్కాలకు చెబుతూ వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. ఎలా ఉపయోగించాలో చెబుతూ ఉంటుంది. సహజ పద్దతుల్లో వంటలు వండాలని, ఎలాంటి ఆహారం తీసుకోవాలంటూ, స్వయంగా వండుతూ వీడియోల ద్వారా అందరికీ తెలిసేలా చేస్తూ ఉంటుంది.

    తాజాగా కరోనాపై స్పందిస్తూ..

    తాజాగా కరోనాపై స్పందిస్తూ..

    తెలంగాణలోని మొట్ట మొదటి కరోనా కేసు నమోదైందని, సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్‌లో వ్యాధి నిర్దారణ అయిందని ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా తెలంగాణలోకి వచ్చేసిందని.. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారనటి చెప్పుకొచ్చింది.

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

    తెలంగాణలో కరోనా బయటపడిందని కంగారు పడవద్దని సూచించింది. దీనికి యాంటీ బయోటిక్స్‌ను ఇంకా కనుగొనలేదని, ఆయుర్వేద పద్దతులు ఉన్నాయని అంటున్నారని అయితే అవేవీ ఇంకా నిరూపించబడలేదని తెలిపింది.

     బయట తిరగొద్దని..

    బయట తిరగొద్దని..

    దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, జ్వరం వంటివి కరోనా లక్షణాలని, ఇలా ఎవరికైనా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది. వారిని బయట తిరగనివ్వొద్దని తెలిపింది. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్క్‌లు ధరించాలని చెప్పుకొచ్చింది.

    English summary
    Upasana Konidela Comments On Corona Virus In Telangana. A Corona Virus Case Is Found In Telangana. So That Upasana Gave Wareness On Corona Virus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X