Upasana: కూతురిపై ఉపాసన తొలి రియాక్షన్.. ఆ ఫొటోతో ఎమోషనల్ నోట్
మెగా కోడలు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి పండంటి ఆడబిడ్డకు జూన్ 20న జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో చెర్రీ, ఉపాసన ఇళ్లల్లో సంబురాలు నెలకొన్నాయి. ఇక మెగా ప్రిన్సెన్స్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. ఇటీవలే మీడియా ముందుకు వచ్చిన రామ్ చరణ్ తన కూతురు గురించి ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఇప్పుడు తాజాగా తమ చిన్నారి పాపకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఉపాసన కొణిదెల కామెంట్స్ చేశారు.
మెగా కుటుంబంలో మెగా ప్రిన్సెస్ అడుగు పెట్టిన విషయం తెలిసిందే. జూన్ 20 అంటే మంగళవారం రోజున తెల్లవారు జామున రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు అయ్యారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని అపోలో వైద్యులు అధికారికంగా ప్రకటన విడుదల చేసి తెలిపారు. తమ కుటుంబంలోకి మహాలక్ష్మీ వచ్చిందని సంబురాలు చేసుకున్నారు మెగాస్టార్ ఫ్యామిలీ మెంబర్స్.

మనవరాలి రాకతో తాతగా అతిపెద్ద ప్రమోషన్ పొందిన మెగాస్టార్ చిరంజీవి సంతోషంలో మునిగిపోయారు. దీనిపై తాజాగా రియాక్ట్ అవుతూ రామ్ చరణ్-ఉపాసనకు విషెస్ తెలియజేశారు. ఇటీవల మీడియా ముందుకు వచ్చిన రాణ్ చరణ్ కూతురుపై చూపించిన అభిమానంపై మాట్లాడారు. అభిమానులు మాపై చూపించే ప్రేమ అలాగే వారు చేసే పూజలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే మా శ్రేయోభిలాషులు మాకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ కు కూడా చాలా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.

ఇక తాజాగా తమ చిన్నారిపై ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ చిన్ని తల్లికి లభిస్తున్న ఘన స్వాగతం తమను మంత్ర ముగ్ధుల్ని చేసిందని తెలిపారు. తమపైనా, తమ చిన్నారిపైనా ప్రేమ, ఆశీస్సులు కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఉపాసన కొణిదెల వెల్లడించారు. ఇలా ఎమోషనల్ నోట్ రాసుకొచ్చిన ఉపాసన ఓ ఫొటో షేర్ చేశఆరు. ఉపాసన ఒడిలో బేబీ ఉండగా.. రామ్ చరణ్ ఒడిలో పెట్ డాగ్ ఉంది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











