అత్తమ్మ సురేఖపై ఉపాసన కొణిదెల ఫిర్యాదు.. సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు!

మెగా‌స్టార్ చిరంజీవి కుటుంబంలో ప్రేమ, అభిమానాలకు కొదువేం కనిపించదు. పండుగైనా, స్పెషల్ ఈవెంట్‌ అయినా అందరూ కలిసి ఘనంగా జరుపుకొంటారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఆనందంగా గడపడమే కాకుండా సంబరాలు చేసుకొంటారనే విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది. అయితే తాజాగా ఉపాసన తమ అత్త సురేఖపై ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకొంటున్నది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..

చిరంజీవి ఇంట్లో జరిగే శుభ కార్యాలు, పండుగలు, ఇతర ఈవెంట్లకు సంబంధించిన వీడియోలు అభిమానులకు మంచి అనుభూతిని పంచుతాయి. తన అభిమాన నటుడు కుటుంబంలో సభ్యుల మధ్య ఉండే ప్రేమలను చూసి ఫ్యాన్స్ పొంగిపోతుంటారు. వారి మధ్య అనుబంధాలను స్పూర్తిగా తీసుకొంటారు.

Upasana Konidela Funny Video on Surekha Konidela amid Avakaya pachchadi Making

సంక్రాంతి పండుగ గానీ, దీపావళీ గానీ, దసర గానీ. అలాగే రాఖీ పండుగ సమయంలో ఇంట్లో జరుపుకొన్న వేడుకలను చిరంజీవి స్వయంగా తన అభిమానులకు షేర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటిలో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో మెగాస్టార్ గడిపిన క్షణాలు నిజంగా అందరికీ మంచి ఫీలింగ్‌ను కలుగ జేస్తాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అవకాయ పచ్చడి పెట్టే కార్యక్రమం ఫన్నీగా జరిగింది. ఆ కార్యక్రమంలో చిరంజీవి తల్లి గారు అంజనీదేవీ, సతీమణి సురేఖ, ఇతర కుటుంబ సభ్యులు కలిసికట్టుగా పచ్చడి పెట్టే కార్యక్రమాన్ని వినోదంగా కొనసాగించారు. సురేఖ స్వయంగా ఆవకాయ పచ్చడి పెట్టే పనుల్లో స్వయంగా భాగమయ్యారు. అప్పుడే కోడలు ఉపాసన వచ్చి ఆ కార్యక్రమాన్ని మరింత ఫన్ చేర్చారు.

సురేఖ ఆధ్వర్యంలో ఆవకాయ పచ్చడి పెట్టే విధానాన్ని ఉపాసన వీడియో తీస్తూ అందర్నీ ఆటపట్టించింది. అత్తమ్మ అంటూ వీడియో తీస్తుంటే.. ఏం చేస్తున్నారు అని అడిగింది. దాంతో ఉపాసన క్యా బోల్ రహే అంటూ అడిగింది. దాంతో నాకు హిందీ అసలే రాదు అని నవ్వుతూ పనుల్లో మునిగిపోయింది. ఇంటికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్‌ను పలుకరిస్తూ.. హాయ్ అంటీ.. వెలకమ్‌ టూ అత్తమ్మ కిచెన్ అంటూ మాటలు కలిపింది.

ఇక చిరంజీవి అమ్మగారైన అంజనీదేవీతో మాట్లాడుతూ.. ఏంటీ నాయనమ్మ.. ఏంటీ ఇంత సీరియస్‌గా ఉన్నారు అని ఉపాసన అంటే.. సీరియస్ ఏమీ లేదు. పనిలేక ఇలా కూర్చొన్నాను అని సమాధానం ఇచ్చారు. అయితే మీ కోడలు పికిల్ సరిగా చేయడం లేదా? అని ఉపాసన అడిగితే.. నీవు ఇంటికి కోడలు పిల్లవు ఉన్నావుగా అంటూ సమాధానం చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X