Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగా కోడలికి ప్రశంసల వెల్లువ.. పవన్ మొదలు బన్నీదాకా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఉపాసన కామినేనిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చరణ్ భార్యగా.. మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలిగా ఉపాసనకు అన్ని చోట్లా మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు రామ్ చరణ్, ఉపాసన ఐదేళ్లు ప్రేమించి పెద్దలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఉపాసన అపోలో హాస్పిటల్స్‌లోని అపోలో లైఫ్ విభాగానికి వైస్ చైర్మన్ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే సోషల్ మీడియాలో సైతం చాలా యాక్టిివ్ గా ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి కోడలిగా.. రామ్ చరణ్ భార్యగా మెగా ఫ్యామిలీతో మమేకైపోయిన ఉపాసన మెగా ఫ్యామిలీ నుంచి అలాగే మెగా ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు ప్రశంసలందుకుంటోంది..
దానికి కారణం మెగా ఫ్యామిలీలో ఎవరికి ఎలాంటి అనారోగ్యం వచ్చినా ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి తమ అపోలో హాస్పిటల్స్ నుంచి స్పెషల్ టీమ్స్ పంపించి ఆరోగ్యం గురించి వాకబు చేయిస్తోందట. ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. పవన్ అయితే కరోనా బారిన పడటమే కాక ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కూడా ఉందని బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పవన్ వద్దకు ఉపాసన అపోలో హాస్పిటల్ నుంచి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ టీమ్ ను పంపించిందని, వారు పవన్ ను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండేవారని తెలుస్తోంది.
ఇక అల్లు అర్జున్ కి సైతం కరోనా రావడంతో ఆయన త్వరగా కోలుకునేందుకు ఉపాసన ఫుడ్ డైట్ తో కూడిన ఒక ప్యాక్ పంపిందట. ఎలాంటి పదార్థాలు తీసుకుంటే త్వరగా కోలుకుంటాతో అలాంటి పదార్థాలతో కూడిన ప్యాక్ ను బన్నీకి ఉపాసన పంపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న అల్లు అర్జున్ డాక్టర్ల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కు స్టార్ ఓ స్పెషల్ కిట్ ను పంపించారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు కూడా.