Upasana:'ఇదే మాకు గొప్ప ఆశీర్వాదం' మెగా కోడలు ట్వీట్ వైరల్..

Upasana: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఈ మెగా కోడలు నిత్యం ఏదోక సేవాకార్యక్రమంలో పాల్గొంటూ తన గొప్ప మనసు చాటుకుంటుంది. ప్రస్తుతం ఉపాసన ఇల్లాలుగా మెగా కుటుంబంలోని ప్రేమానురాగాలు దక్కించుకుంటూనే.. మరోవైపు అపోలో ఆసుపత్రికి సంబంధించిన కీలక బాధ్యతలను నిర్వహిస్తోంది. తాజాగా ఉపాసన ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఇంతకీ ఉపాసన తీసుకున్న షాకింగ్ నిర్ణయమేంటీ ?

రామ్ చరణ్ సతీమణి ఉపాసన వ్యాపార రంగంలోనే కాకుండా సేవ కార్యక్రమాలలో దూసుకుపోతోంది. తాజాగా అయోధ్య కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయోధ్య రాముని దర్శనం కోసం వచ్చిన భక్తుల కోసం అపోలో గ్రూప్ ద్వారా ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించారు. ఉపాసన తన కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య శ్రీరాముని దర్శించుకున్నారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అపోలో ఫ్రీ ఎమర్జెన్సీ సర్వీసును ప్రారంభించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Upasana Konidela launches Free Apollo Emergency Care Centre at Ayodhya as a service to pilgrims

'సనాతన ధర్మం గురించి తన తాత గారి నుండి నేర్చుకున్నానని, అయోధ్యలో సేవ చేసే అవకాశం లభించడం తమకు దక్కిన ఆశీర్వాదం అంటూ పేర్కొంది. తాత గారి స్ఫూర్తితో తమ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక కేంద్రాలైన తిరుమల శ్రీశైలం కేదార్నాథ్, బద్రీనాథ్ లలో ఇప్పటికే అపోలో ఎమర్జెన్సీ కేర్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో పంచుకున్నారు. ప్రస్తుతం మెగా కోడలి ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ తో పాటు నెటిజెన్స్ ఉపాసనను అభినందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్‌' సినిమాతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. పొలిటికల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్‌, టీజర్‌కు భారీ రెస్పాన్స్ వస్తుంది. దీంతో సినిమాతో భారీ అంచనాలు పెరిగాయి.

More from Filmibeat

Read more about: apollo ayodhya upasana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X