VarunTej Lavanya Tripathi: మామకు తగ్గ కోడలు... వరుణ్, లావణ్య పెళ్లి వేదికపై ఉపాసన లీక్స్

చిరు లీక్స్ గురించి అందరికీ తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కింది. ఆ సినిమా టైటిల్ అనుకోకుండా చిరంజీవి ఓ మూవీ ఫంక్షన్ లో లీక్ చేశాడు. ఇక అప్పటి నుంచి ఆయన చిరు లీక్స్ గా ఫేమస్ అయిపోయాడు. ఇక చిరు లీక్స్ పేరిట చాలా విషయాలు లీక్ చేస్తూ.. మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు చిరు. ఇప్పుడు ఆయన బాటలోనే మెగా కోడలు ఉపాసన చేరింది. మెగా ఇంట్లో పెళ్లి సందడి షూరు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక వరుణ్, లావణ్యల పెళ్లిపై ఉపాసన లీక్స్ ఇచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మెగా ఇంట్లో త్వరలోనే పెళ్లి సందడి మొదలు కాబోతుంది. నాగాబాబు ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక నాగబాబు కుమారుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుని.. పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ జంట పెళ్లి షాపింగ్ నుంచి.. ప్రివెడ్డింగ్ వేడుకలు కూడా జరుపుకుంది.

Varun Lavanya Marriage

గత కొన్నేళ్లుగా వరుణ్ లావణ్యల మధ్య ఏదో ఉందంటూ వార్తలు వచ్చాయి. వాటన్నింటినీ నిజం చేస్తూ వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇక వరుణ్ తేజ్, లావణ్యల ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాల నడుమ ఎంతో వైభవంగా వీరి నిశ్చితార్థం జరిగింది. ఇక నిశ్చితార్థం జరిగి నెలలు అవుతున్నా వీరి పెళ్లి అప్పుడు.. ఇప్పుడు అంటూ వార్తలు వచ్చాయి. వీరి పెళ్లికి సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.

తాజాగా లావణ్, వరుణ్ జంట ప్రీవెడ్డింగ్ వేడుకలను జరుపుకుంది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ప్రీ వెడ్డింగ్ వేడుకకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి, ఉపాసన కొణిదెల సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మరోవైపు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీరి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. వచ్చే నెలలోనే వరుణ్, లావణ్య వివాహం జరగబోతున్నట్లుగా సమాచారం.

అయితే వీరి పెళ్లి వేడుక ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగనున్నట్లు క్లారిటీ వచ్చింది. దానికి కారణం ఉపాసన లీక్స్. ఆమె తన తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వరుణ్ తేజ్, లావణ్య ల పిక్స్ చేసింది. ఆమె షేర్ చేసిన ఫోటోస్ , వీడియోస్ నెట్టింట వైరలవుతుండగా... అందులోని ఓ విషయం బయట పడింది. ప్రీ వెడ్డింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ.. టస్కనీ.. మేం వచ్చేశాం అంటూ ఉపాసన రాసుకొచ్చింది.

Upasana Konidela Instagram Post

ఇటలీ మధ్య ప్రాంతంలో ప్రకృతి రమణీయతకు మారుపేరుగా టస్కనీకి మంచి గుర్తింపు ఉంది. ఇక్కడ ఎల్బా ప్రాంతంలోని బీచ్ లు టూరిస్టులను ఆకట్టుకుంటాయి. ఇక ఇక్కడే వరుణ్, లావణ్య వివాహం జరగనున్నట్లు ఉపాసన పోస్టుతో అర్థం అవుతుంది. ఇక ఉపాసన పోస్టుతో వరుణ్, లావణ్యల పెళ్లి వేదిక లీక్ అయినట్లు తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ మామకు తగ్గ కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం గతంలో చిరు కూడా ఇలాగే లీక్స్ ఇచ్చేవారు.

Upasana Konidela leaked Varun and Lavanya Marriage Venue

ఆచార్య సినిమా టైంలో చిరంజీవి సినిమా పేరు ఆచార్య అంటూ లీక్ ఇవ్వడంతో.. చిరు లీక్స్ బాగా ఫేమస్ అయింది. ఇప్పుడు వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి వేదికపై ఉపాసన లీక్ చేసి.. ఉపాసన లీక్స్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలా పెళ్లి నవంబర్ మొదటి వారంలో జరగనుంది తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X