For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR టీమ్‌తో మెగా కోడలు.. ఉక్రెయిన్‌లో చీర్స్.. రాంచరణ్ ఐడీతో సెట్స్‌లోకి ఎంట్రీ!

  |

  మెగా కోడలు ఉపాసన తెలుగు ప్రజలందరికీ దాదాపు పరిచయమే. మెగాస్టార్ చిరంజీవి కోడలు గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఆమె తెలుగు సినీ వర్గాల గుర్తింపు, తెలుగు ప్రేక్షకులలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకుంది. ఇప్పుడు అంటే చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరు సోషల్ మీడియా లో ఎంట్రీ ఇచ్చి తమ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఆ బాధ్యతలు కూడా తానే తీసుకుని స్వయంగా ఫ్యాన్స్ కి అందజేసేవారు ఉపాసన. అలా ఒక రకంగా చిరంజీవి అభిమానులు రామ్ చరణ్ అభిమానులు అలాగే మెగా ఫ్యామిలీ మధ్య ఆమె ఒక వారధిలాగా పనిచేశారు అని చెప్పాలి. అయితే ఇప్పుడు చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె ప్రస్తుతానికి ఆమె అపోలో హాస్పిటల్స్ విషయంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ముందుకు వెళుతున్నారు..

  అయితే ఆమె తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా ఒక భారీ బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఆర్ఆర్ఆర్ సినిమాని దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు పెద్ద కుటుంబాలకు చెందిన హీరోలు నటిస్తూ ఉండడం పలు భాషలకు చెందిన కీలక నటీనటులు నటిస్తుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ ఉక్రెయిన్ దేశంలో చేస్తున్నారు. ఈ దేశంలో ఎంటరైన అప్పటి నుంచి పలు విధాలుగా ఈ దేశంలో షూట్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు ఆర్ఆర్ఆర్ టీం.

  Upasana Konidela leaves Rrr Team At Ukraine and flies back to hyderabad

  మరీ ముఖ్యంగా కొన్నాళ్లపాటు ఆర్ఆర్ఆర్ అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను ఎన్టీఆర్ హ్యాండిల్ చేస్తారు అని చెప్పి ఆసక్తి పెంచారు. అందుకు తగ్గట్టుగానే ఎన్టీఆర్ కూడా ప్రతిరోజు ఏదో ఒక విధమైన అప్డేట్ ఇచ్చి సినిమాని వార్తలలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఉపాసన ఉక్రెయిన్ నుంచి వెనుతిరుగుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గత కొద్ది రోజులుగా ఆమె భరతో కలిసి అక్కడే ఉంటున్నారు. ఇక టీమ్లో ఉన్న అందరికీ చీర్స్ చెబుతూనే తనను ఆర్ ఆర్ యూనిట్ చాలా బాగా చూసుకుంటాడని ఇలాంటి ఆతిధ్యం ముందెన్నడూ అందుకోలేదని జక్కన్న, జక్కన్న కొడుకు-కోడలు, రాజమౌళి భార్యని పేరు పేరునా తలుచుకున్నారు. అంతేగాక ప్రస్తుతం హైదరాబాదు బయలుదేరే సమయం ఆసన్నమైందని పేర్కొన్న ఆమె. మిమ్మల్నందరినీ హైదరాబాద్లో కలుసుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంటూ వెల్లడించారు. అయితే మరోపక్క ఈ సినిమా దసరా సందర్భంగా అక్టోబర్ 13వ తేదీన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే తాజాగా ప్రచారం మాత్రం అక్టోబర్ నెలలో సినిమాను విడుదల చేసే పరిస్థితులు కనిపించడం లేదని వచ్చే ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 వ తేదీన సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయి అనేది వేచి చూడాల్సి ఉంది.

  English summary
  Upasana, who said goodbye to the RRR movie shooting, left Ukraine for Hyderabad.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X