పనికిరాని కండోమ్స్‌తో మెగా కోడలు ఉపాసన ఏం చేసిందో తెలుసా?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. ఆమెను గుర్తు పెట్టుకోవడానికి ఆమె బ్యాక్ గ్రౌండ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ మెగా కోడలు బ్యాక్ గ్రౌండ్ అవసరం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా కనిపించే ఉపాసన ఇటీవల వేస్టేజ్ అనేది కూడా ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుందని కండోమ్స్ ద్వారా తనదైన శైలిలో ఒక మెస్సేజ్ ఇచ్చింది.

ఫొటోస్ వైరల్
అపోలో సంస్థలో కూడా కీలకమైన వ్యక్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన జనాలకు మంచి సందేశాలతో పాటు ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ ఇవ్వడంలో కూడా ముందుంటారు. ప్రస్తుతం ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

పవర్ఫుల్ ఉమెన్..
పవర్ఫుల్ ఉమెన్ గా ప్రపంచవ్యాప్తంగా మెగా కోడలు తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. వరల్డ్ వైడ్ గా ఉన్న అపోలో సామ్రాజ్యాన్ని ఆమె తన కనుసైగలతో నడుపుతున్నారు అంటే సమాన్యమైన విషయం కాదు. ఎంత ఒత్తిడి ఉన్నా కూడా సమస్యలను చిటికెలో మాయం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మంచి పనుల్లో కూడా సాయం చేసేందుకు ఆమె ముందుంటారు.

కండోమ్స్ తో ఇలా..
రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ డ్రెస్ లో దర్శనమిచ్చింది ఉపాసన. అయితే ఆ డ్రెస్ ని తయారు చేయడానికి డిఫెక్టేడ్ కండోమ్స్ కూడా ఉపయోగించారట. స్థానిక డిజైనర్స్ నుంచి రిజెక్ట్ చేయడబడిన టెక్స్ టైల్స్ స్క్రాప్ కూడా డ్రెస్ కోసం ఉపయోగించారట. పనికిరానివి కూడా ఉపయోగపడేవే అంటూ తనదైన శైలిలో ఉపాసన ఇన్స్టాగ్రామ్ లో క్లియర్ గా వివరణ ఇచ్చింది.

మొన్న ఆర్గానిక్ ఫార్మ్..
రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ఉపాసన ఒక మంచి సందేశాన్ని అందించారు. మన పాత కాల పద్ధతులు కూడా చాలానే ఉపయోగపడతాయని ఆర్గానిక్ ఫార్మ్ అందులో చాలా ముఖ్యమైనదని ఉపాసన వివరణ ఇచ్చింది. పేడ ఎత్తుతు రీసెంట్ గా పొలాల్లో పని కూడా చేశారు. ఈ విదంగా రోజుకో మంచి మాటతో మెగా కోడలు జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది.
View this post on InstagramA post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on


Click it and Unblock the Notifications











