ప్రేమ పాఠాలు చెప్పిన మెగా కోడలు.. ఉపాసన పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా
రామ్‌చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హాస్పిటల్స్ వ్యవహారాలు చూసుకుంటూ నిత్యం బిజీగా ఉంటుంది ఉపాసన. అయితే తాను క్షణం తీరిక లేకుండా ఉన్నా గానీ సమాజం పట్ల, ఆరోగ్య పరిరక్షణ పట్ల అందరికీ అవగాహన కలిగించేందుకు సోషల్ మీడియా సాధనాలను ఉపయోగిస్తూ ఉంటుంది. సహజమైన పద్దతుల్లో ఆరోగ్య రక్షణ ఎలా చేసుకోవాలో అవగాహన కలిగిస్తూ ఉంటుంది.
మరోవైపు రామ్ చరణ్‌కు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. తన వ్యవహారాలను మాత్రమే కాకుండా సామాజిక సమస్యలపైనా ఉపాసన గొంతెత్తడంతో అందరూ ఆమెను అభిమానిస్తుంటారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ మెగా కోడలు ప్రేమకున్న అర్థాన్ని చెప్పుకొచ్చింది.

'మొదట నిన్ను నువ్వు ప్రేమించడానికి ప్రయత్నించు. అప్పుడే ఇతరులను ప్రేమించే దృష్టి అలవడుతుంది. నీకు నువ్వు ప్రేమ లేఖ రాసుకో. నీకు సంతోషం కలిగించే పనులు మాత్రమే చేయి. మారే నీ ప్రపంచానికీ నువ్వే సాక్ష్యంగా నిలువు' అని పేర్కొంది. ఉపాసన చెప్పిన ఈ పాఠాలు అందర్నీ ఆకర్షించాయి.


Click it and Unblock the Notifications











