Upasana Konidela: గుడ్ న్యూస్ చెప్పిన ఉపాసన... క్లీంకారకు ఇద్దరు చెల్లెళ్లు అంటూ పోస్ట్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మెగా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాక.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకుంది. అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ.. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని నెటిజన్లతో పంచుకుంటుంది. తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. క్లీంకారకు ఇద్దరు చెల్లెళ్లు పుట్టారని ఫోటోను పోస్ట్ చేసింది కూడా. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.
మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. తమ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్నీ అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. రామ్ చరణ్, ఉపాసనలకు పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో మెగా వారసురాలు మెగాఫ్యామిలీలోకి అడుగుపెట్టింది. ఇక తన ముద్దుల మనవరాలికి మెగాస్టార్ చిరంజీవి పేరు క్లీంకారగా నామకరణం చేశారు.

ఇక మెగా వారసురాలు ఎంట్రీతో మెగా ఫ్యామిలీ మొత్తం సంబరాలు చేసుకుంది. ఇక ఉపాసన కూడా క్లీంకార గురించి ఆసక్తికర విషయాలు చెబుతూ వస్తుంది. ఇప్పటికే తనకోసం ఓ స్పెషల్ రూమ్ ఏర్పాటు చేసింది. అంతే కాదు.. కేర్ టేకర్ ను కూడా పెట్టేసింది. ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు ఉపాసన క్లీంకారా చెల్లెళ్లను పరిచయం చేస్తూ ఓ శుభవార్త చెప్పింది. అదేంటి క్లీంకారకు చెల్లెళ్లు అనుకుంటున్నారా...?
అసలు విషయం ఏంటంటే... ఉపాసన తన చెల్లెలి పిల్లలను పరిచయం చేసింది. అంటే క్లింకారకు చెల్లెళ్లు అవుతారు. ఉపాసన చెల్లి అనుశ్ పాల ట్విన్స్ కు జన్మనిచ్చింది. అనుష్పల డిసెంబర్ 2021 లో అర్మాన్ ఇబ్రహీంను వివాహమాడింది. ఇక గతేడాది చివర్లో అనుశ్ పాల ప్రెగ్నెంట్ అవ్వగా.. ఈ మధ్యనే ఆమె ట్వీన్స్ కు జన్మను ఇచ్చింది. ఇక తాజాగా వారి నామకరణం ఫంక్షన్ లో రామ్ చరణ్, ఉపాసన సందడి చేశారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలను ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దానితో పాటు.. మేము అద్భుతమైన ముగ్గురిని మీకు పరిచయం చేస్తున్నాను అంటూ రాసుకువచ్చింది. వీరంతా పవర్ పఫ్ గర్ల్స్.... క్లీంకార తన ఇద్దరు సిస్టర్స్ ఆరా పుష్ప ఇబ్రహీం, రైకా సుచరత ఇబ్రహీంలతో కలిసిపోయిందంటూ పోస్ట్ చేసింది మెగా కోడలు. ఇది చూసిన మెగాఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు. అప్పుడే క్లీంకారాకు చెల్లెళ్లు వచ్చేశారని అంటున్నారు.
ఇక ఆ ఫోటోలు రామ్ చరణ్, ఉపాసన, క్లీంకారతో పాటు.. ఉపాసన చెల్లెలు అనుశ్ పాల, ఆమె భర్త... ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే చిత్రం చేస్తున్నారు. ఇది ఈ ఏడాది రిలీజ్ చేయనున్నారు మేకర్స్. దీనితో పాటు బుచ్చిబాబు సనతో ఆర్సీ 16, ఓ హిందీ ఫిల్మ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











