Ram Charan: చిరంజీవి బాటలోనే రామ్ చరణ్... అంతా ఆమె ట్రైనింగ్ అంటూ ఉపాసన పోస్ట్

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్, ఉపాసన జంట ఉంటారు. ఇక ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ ఒకరి గురించి ఒకరు గొప్పగా చెప్పుకుంటారు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ సంక్రాంతి సంబురాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీరంతా కలిసి బెంగళూరులో సంబురాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తండ్రి బాటలోనే పోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఓ వీడియోను ఉపాసన షేర్ చేస్తూ.. ఆమె ట్రైనింగ్ అంతా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను టాలీవుడ్ మెగా ఫ్యామిలీ అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఈ సంక్రాంతికి మనుమరాలు క్లీంకారాతో పాటు.. మెగా కోడ‌లు లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీలో అడుగుపెట్టడంతో పండగని బాగానే జరుపుకుంటున్నారు. ఇప్ప‌టికే మెగా ఫ్యామిలీ స‌భ్యులంతా ఒక్కొక్కరుగా బెంగళూరు ఫార్మ్ హౌస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అల్లు ఫ్యామిలీ సైతం బెంగళూరు వెళ్లింది. ఇక అక్కడి విశేషాలన్నిటిని మెగా వారి పెద్ద కోడలు ఉపాసన ఇన్‌ స్టాగ్రామ్ లో స్టోరీలో పెడుతుంది.

Upasana Konidela Shares Ram Charan Dosa Making Video in Sankranthi 2024 Celebrations

ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ పోస్టుల్లో కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, అల్లు శిరీష్, అల్లు అర్జున్ కుమార్తె అర్హ, చిరు సతీమణి సురేఖ, వైష్ణవ్ తేజ్, రామ్ చరణ్, ధరమ్ తేజ్.. ఇలా చాలా మంది కనిపిస్తున్నారు. కొత్త కోడలు లావణ్య మెగా ఫ్యామిలీ కోసం సున్నుండలు కూడా చేసింది. ఇక పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా అక్కడే జరిగాయి.

ఇదిలా ఉంటే.. ఉపాసన.. రామ్ చరణ్ వీడియోను షేర్ చేసింది. రామ్ చరణ్ దోశలు వేస్తున్న వీడియోను ఉపాసన తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో పంచుకుంది. ఇక ఈ వీడియోలో రామ్ చరణ్ దోశలు వేస్తూ.. కనిపించాడు. అయితే ఈ వీడియోకు ఓ క్రేజీ క్యాప్షన్ జోడించింది ఉపాసన. రామ్ చరణ్ దోశలు వేసే ట్రైనింగ్ అంతా తన అత్త సురేఖ ఇచ్చిందని రాసుకువచ్చింది. ఇక ఈ వీడియోల్లో తన అత్త సురేఖ కూడా దోశలు వేస్తూ కనిపించింది.

Upasana Konidela Shares Ram Charan Dosa Making Video in Sankranthi 2024 Celebrations

అయితే ఈ వీడియోలు చూసిన నెటిజన్స్... గతంలో చిరంజీవి సైతం దోశలు వేస్తూ కనిపించారు. అప్పట్లో ఆ వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. ఇప్పుడు చరణ్ కూడా దోశలు వేయడంతో.. తండ్రి బాటలోనే చెర్రీ నడుస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చరణ్, చిరంజీవి వీడియోలు వైరల్ గా మారాయి.

Upasana Konidela Shares Ram Charan Dosa Making Video in Sankranthi 2024 Celebrations

ఇక చరణ్ విషయానికి వస్తే... రామ్ చరణ్ గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో కియార అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇది ఈ ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటుగా బుచ్చిబాబుతో తన 16వ సినిమాను చేస్తున్నాడు చరణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X