తండ్రికి కొడుకు అల్టిమేట్ గిఫ్ట్.. అతనికి భార్య అయినందుకు.. ఉపాసన ఎమోషనల్
మెగా అభిమానుల ఆకలి తీర్చేందుకు మెగాస్టార్ చిరంజీవి సైరాతో వాళ్ల ముందుకు వచ్చాడు. తమ ఆరాధ్య దైవం ఎప్పుడెప్పుడు వెండితెరపై గర్జిస్తాడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన వీరాభిమానులకు ఇక పండగే. సైరా సినిమా చూసిన అందరూ చిరు విశ్వరూపాన్ని చూశామని కామెంట్లు పెడుతున్నారు.
మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఫీవర్ ఓ రేంజ్లో ఉంది. ఏ థియేటర్ వద్ద చూసిన సైరా హంగామానే కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైరా సునామీ సష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, లాంగ్ వీకెండ్ కలవడంతో పెద్ద మొత్తంలోనే రాబట్టనుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక రేపటి నుంచి ఎన్ని రికార్డుల బద్దలవుతాయో చూడాలి.

ఈ సినిమాపై స్పందిస్తూ.. మెగా కోడలు ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో స్పందించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మెగా అభిమానులను పలకరిస్తూ ఉంటారు. తాజాగా ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. 'సైరాలో చిరంజీవి చించేశారు.. నిజంగా గ్యాంగ్ లీడర్.. తండ్రికి కొడుకు ఇచ్చే అల్టిమేట్ గిఫ్ట్.. రామ్ చరణ్కు భార్యను అయినందుకు, చిరంజీవికి కోడలిని అయినందుకు గర్వపడుతున్నా'నని అన్నారు.


Click it and Unblock the Notifications











