ఈజిప్ట్‌లో నారా బ్రాహ్మణి, ఉపాసన సందడి!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఎప్పుడూ చాలా సరదాగా ఉంటారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. అభిమానులతో టచ్ లో ఉంటేనే రాంచరణ్ విశేషాలన్నీ తెలియజేస్తున్నారు. ఇటీవల ఉపాసన ఈజిప్ట్ వెకేషన్ వెళ్లారు. ఈ వెకేషన్ కు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా వెళ్లడం విశేషం. నారా బ్రాహ్మణి, ఉపాసన మంచి స్నేహితులు. మరి కొంతమంది స్నేహితులతో కలసి వీళ్లంతా ఈజిప్టు టూర్ వెళ్లారు.
నారా బ్రాహ్మణి, తాను కలసి సందడి చేసిన దృశ్యాలని ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. మూడు రోజులపాటు ఈ టూర్ చాలా సరదాగా సాగిందని తెలిపారు. ఈజిప్టు పిరమిడ్స్ సహా మరి కొన్ని పర్యాటక ప్రాంతాలని సందర్శించారు.

నారా బ్రాహ్మణి, ఉపాసన కలసి సందడిచేయడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉపాసన సోషల్ మీడియాలోనే కాదు పలు చారిటి కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటారు. రాంచరణ్ సినిమా షూటింగ్స్, సరదాగా గడిపిన దృశ్యాలు ఇలా ప్రతి విషయాన్ని ఉపాసన అభిమానులకు తెలియజేస్తుంది.


Click it and Unblock the Notifications











