ఉపాసన మనసులో తీరని విషాదం.. ఆమె మరణంతో డిప్రెషన్ లోకి.. షాకింగ్ కామెంట్స్
ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కు గురి చేసింది. ప్రముఖ సెలబ్రెటీలతో మంచి పరిచయాలు ఉన్న ఆమె ఇలా హఠాత్తుగా తనువు చాలించడం చర్చనీయాంశంగా మారింది. బంజారాహిల్స్‌లోని తన అపార్ట్‌మెంట్ లో ప్రత్యూష శవమై కనిపించింది. ఇక ఆమె మృతిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మెగా కోడలు అపోలో అధినేతల్లో ఒకరైన ఉపాసన కొణిదెల కూడా ఆమె మృతిపై సోషల్ మీడియా ద్వారా విచారం వ్యక్తం చేశారు.

మంచి స్నేహితురాలు
ప్రత్యూష గరిమెళ్ల సినిమా ప్రపంచంలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గా మంచి గుర్తింపు అందుకున్న వారిలో ఒకరు. ఆమె కేవలం సినిమా ప్రపంచంలోనే కాకుండా ఎంతో మంది ప్రముఖ వ్యాపారవేత్తలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక ఉపాసన కొణిదెల కూడా ఆమెకు మంచి స్నేహితులు. ప్రత్యూష గరిమెళ్ల మృతిపై అమెకూడా విచారం వ్యక్తం చేశారు. ఆమె ప్రతి విషయంలోనూ చాలా ఉత్తమురాలు అని పేర్కొంది.

అనుమానాలు
ప్రత్యూష రీసెంట్ గా తన ఫ్లాట్ లో ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయంలో ఇంకా చాలా అనుమానాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ఉండడంతో ఈ అనుమానాస్పద మృతి ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాసన విచారం
అయితే ప్రత్యూష గరిమెళ్ల మృతిపై స్పందించిన మెగా కోడలు ఉపాసన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 'నా బెస్టీ మై డియరెస్ట్ ఫ్రెండ్. చాలా త్వరగా వెళ్లిపోయింది. నిజంగా ఇది విచారమైన సంఘటన. ఆమె కెరీర్ లో స్నేహితులు కుటుంబంలో అన్నింటిలో ఉత్తమమైనది. అయినప్పటికీ నిరాశకు లోనైంది..అని ఉపాసన అన్నారు.

కర్మను నమ్ముతున్నట్లు..
ఇక ఈ సంఘటన తర్వాత కర్మ అనేది జీవితకాలం గుండా వెళుతుందని నిజంగా నమ్మండి. ఇక ఆమెకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు ఉపాసన సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. కర్మను తాను కూడా నమ్ముతానని కూడా ఉపాసన వివరణ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రత్యూష చాలా సందర్భాల్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఈవెంట్స్ లో కూడా ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగారు.

మరో కారణం ఉందా?
ఇక ప్రత్యూష మృతిపట్ల ప్రముఖ సినీ సెలబ్రెటీలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఇక ఆమె మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని కూడా పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై మరింత లోతుగా విచారించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రత్యూష నిజంగానే డిప్రెషన్ కు లోనై ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా కారణం ఉందా అనేది తెలియాల్సి ఉంది.

హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం..?
ప్రత్యూష ప్రముఖ హీరోయిన్ కృతి శెట్టి సినిమాలకు కూడా వర్క్ చేశారు. ఇక పలు యాడ్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు అందుకొని సినిమాల్లో కూడా అవకశాలు అందుకుంటున్న సమయంలో ఆమె హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ఎవరికి అంతుపట్టడం లేదు. మొన్నటివరకు అందరితో హ్యాపీగానే ఉన్న ప్రత్యూష ఇంత హఠాత్తుగా కన్నుమూశారు అంటే నమ్మలేకపొతున్నారు.


Click it and Unblock the Notifications











