twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    OTTలో రాబోయే బిగ్ మూవీస్.. అఖండ నుంచి శ్యామ్ సింగరాయ్ వరకు.. డేట్ ఫిక్స్!

    |

    రానున్న రోజుల్లో ఓటీటీ మార్కెట్ మరింత పెరిగినట్లు చాలా క్లారిటీ గా అర్థం అవుతోంది. అసలు డిజిటల్ మీడియా లో కూడా ఒక మార్కెట్ ఉంది అని చాలామందికి తెలియదు. సినిమా ఇండస్ట్రీ లకు ఓటీటీ ఫార్ములా అనేది చాలా లాభదాయకమనే చెప్పాలి. సినిమా థియేట్రికల్ గా రిజల్ట్ ఎలా ఉన్నా ఓటీటీ రూట్లో అయితే మంచి ఆదాయం అందుతుంది. ఇక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన చిన్న సినిమాలు చాలా వరకు డిజిటల్ మార్కెట్ లోనే మంచి లాభాలను అందుకున్నాయి. ఇక రాబోయే కొత్త సినిమాలు ఓటీటీ లో ఎప్పుడు ఎక్కడ సందడి చేయబోతున్నాయి అనే వివరాల్లోకి వెళితే..

    పుష్ప అందరికంటే ముందుగా..

    పుష్ప అందరికంటే ముందుగా..

    2021లో బాక్సాఫీస్ వద్ద అత్యధిక స్థాయిలో కలెక్షన్స్ అందుకున్న నెంబర్ వన్ సినిమాగా నిలిచిన పుష్ప సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఈ సినిమా ఓటీటీ లో కాస్త తొందరగానే రాబోతుండడం విశేషం. జనవరి 7వ తేదీన రాత్రి 8 గంటల నుంచి పుష్ప సినిమా అమెజాన్ ప్రైమ్ లో సందడి చేయబోతోంది. హిందీ లో తప్పితే మిగతా అన్ని భాషల్లో కూడా పుష్ప సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేస్తున్నారు.

    నాగ శౌర్య రెండు సినిమాలు

    నాగ శౌర్య రెండు సినిమాలు

    నాగశౌర్య గత ఏడాది పెద్దగా గ్యాప్ లేకుండా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిఫరెంట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన లక్ష్య సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను జనవరి 7వ తేదీన ఆహాలో విడుదల చేయబోతున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన డిఫరెంట్ లవ్ స్టోరీ వరుడు కావలెను జీ 5 లో అదే రోజు ప్రసారం కానుంది.

    రోషన్ పెళ్లి సందడి

    రోషన్ పెళ్లి సందడి

    ఇక దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెళ్లి సందడితో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మ్యూజికల్ గా మంచి సక్సెస్ ను అందుకుంది ఇక ఓటీటీ లోకి ఎప్పుడు వస్తుంది అనే విషయంలో కూడా ఆ చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేశారు. హాట్ స్టార్ లో జనవరి 14న సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

     అఖండ డేట్ మారింది

    అఖండ డేట్ మారింది

    నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఓటీటీ హక్కులను హాట్ స్టార్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో సక్సెస్ అయింది. ఇక మొదట 14వ తేదీన సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత థియేట్రికల్ బిజినెస్ బాగుందని జనవరి 21న విడుదల చేయాలి అని మరో నిర్ణయం తీసుకున్నారు.

    Recommended Video

    2021 Year Ender: Best Telugu Movies Of 2021| Akhanda |Pushpa
    శ్యామ్ సింగరాయ్ ఎప్పుడంటే..

    శ్యామ్ సింగరాయ్ ఎప్పుడంటే..

    ఇక అందరి చూపు ఎక్కువగా నాని శ్యామ్ సింగరార్ పైనే ఉంది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను దంకించుకున్న నెట్ ఫ్లిక్స్ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంది. కానీ ప్రస్తుతం ఈ సినిమాకి కూడా థియేట్రికల్ బిజినెస్ బాగుండడంతో కాస్త ఆలస్యంగానే జనవరి 26 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Upcoming telugu ott movies release dates confirmed
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X