‘గని’ కోసం ఉపేంద్ర.. వరుణ్ తేజ్‌తో ఢీ కొట్టేందుకు రెడీ
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇటు గని, అటు ఎఫ్ 3 ఇలా రెండు చిత్రాలు ఒకే సారి లైన్‌లోకి వచ్చాయి. లాక్డౌన్ వల్ల ఇలా రెండు చిత్రాలుకు డేట్స్ అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. మొత్తానికి రెండు షెడ్యూల్స్ ఒకే సమయంలో జరుగుతున్నా కూడా వరుణ్ తేజ్ ఏ మాత్రం అలిసి పోవడం లేదు. రెండు పడవలపై ప్రయాణం అన్నట్టుగా.. రెండు ప్రాజెక్ట్‌లపై సవారి చేస్తున్నాడు.
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న గని సినిమా కోసం భారీ తారాగణాన్నే దించుతున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్‌ను ప్రారంభించారు. అంతలోపే ఓ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ రెండో షెడ్యూల్ కోసం అసలు సిసలైన వారిని దించబోతోన్నారు. గని సినిమాలో వరుణ్ తేజ్ సునీల్ శెట్టి, ఉపేంద్ర వంటి వారితో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఉపేంద్ర గని సినిమా కోసం హైద్రాబాద్‌కు వచ్చేశాడు.

ఇప్పుడు జరుగుతున్న రెండో షెడ్యూల్ కోసం ఉపేంద్ర హైద్రాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. ఈ చిత్రంలో సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ తారాగణాన్ని తీసుకొచ్చి సినిమాపై హైప్‌ను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇలా కన్నడ ఇండస్ట్రీ నుంచి ఉపేంద్రను కూడా పట్టుకొచ్చారు. మొత్తానికి గని చిత్రంపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











