శ్రీయ సరన్ ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు.. ఉపేంద్ర కామెంట్స్ కు తల దించుకున్న హీరోయిన్!
బ్యూటిఫుల్ శ్రీయ సరన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నా ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో అలరిస్తూనే ఉంటారు. ఇష్టం అనే చిన్న సినిమాతో తెలుగు చిత్రసీమలో ప్రయాణం ప్రారంభించిన శ్రీయ ఆ తర్వాత అనేకమంది అగ్రహీరోలతో జోడి కట్టింది. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ సంపాందించుకుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు తన హవాను కొనసాగిస్తూ వస్తోంది ఈ బ్యూటి. అయితే విలక్షణ హీరోగా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర తాజాగా శ్రీయ సరన్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో శ్రీయ సరన్ తల దించుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన కబ్జా ప్రెస్ మీట్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

సినిమాల మీద సినిమాలు చేస్తూ..
యుక్త వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన హాట్ బ్యూటి శ్రీయ సరన్ 'ఇష్టం' అనే సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. అనంతరం టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జునతో 'సంతోషం' సినిమాలో నటించి కెరీర్‌లో మొదటి సక్సెస్ ను అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ సొట్టల బుగ్గల సుందరి వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకెళ్లింది. ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో ప్రేక్షకులను పలకరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఫేమ్ తీసుకురాలేని సినిమాలు..
ఇటీవల దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRతోపాటు గమనం చిత్రాల్లో నటించింది శ్రీయ సరన్. అయితే అవి హిట్ అయిన శ్రీయకు మాత్రం అంతగా ఫేమ్ తీసుకురాలేకపోయాయి. అలాగే సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ దృశ్యంకు సీక్వెల్ దృశ్యం 2ను హిందీలో తీసుకొచ్చారు. మొదటి సినిమాలానే ఇందులో కూడా శ్రీయ సరన్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాలో శ్రీయ సరన్ కు జోడిగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ నటించారు. ఇప్పుడు తాజాగా ఉపేంద్ర కబ్జా మూవీలోనూ యాక్ట్ చేసింది శ్రీయ.

తెలుగు సినిమాల్లో కూడా..
కన్నడ విలక్షణ హీరో, డైరెక్టర్ ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన ఉపేంద్ర, A, ఓం పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆయన సినిమాలతో హీరోకు కొత్త అర్థం తీసుకొచ్చారు. అంతేకాకుండా ఒకే మాట, కన్యాదానం వంటి చిత్రాలతో తెలుగు స్ట్రయిట్ సినిమాల్లో కూడా ఆయన నటించారు. ఇలా పలు చిత్రాలతో పాపులారిటీ దక్కించుకున్నారు.

మార్చి 17న కబ్జా..
ముఖ్యంగా ఉపేంద్ర సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక అల్లు అర్జున్ సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నెగెటివ్ రోల్ తో మరింతగా తెలుగు వారికి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఉపేంద్ర కబ్జా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆర్ చంద్రు దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 17న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టిన ఈ సినిమా బృందం ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇందులో శ్రీయ సరన్ పై ఉపేంద్ర చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

అతను గొప్ప మొగాడు..
"నేను ఇప్పుడు ఒక్కడి గురించి మాట్లాడతాను. అతను ఇతనే (డైరెక్టర్ చంద్రు) మహానుభావుడు. కబ్జా స్టార్ట్ చేసినప్పుడే కరోనా పాండమిక్ వచ్చింది. 2020లో స్టార్ట్ చేశాం. అది పూర్తయ్యే సరికి 2023 అయింది. కబ్జాను విడుదల చేసేందుక భగీరథ ప్రయత్నం చేశాడు. గ్రేట్ మొగాడు. అందరినీ కలుపుకుని ఈ సినిమా ఒక అలాగే చేయాలి. ఒక పాన్ ఇండియాగా చేయాలి అని పట్టుదలతో ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. కంగ్రాచ్యులేషన్స్. అండ్ థ్యాంక్స్" అని తెలిపారు ఉపేంద్ర.

అందరితో వర్క్ చేశారు..
"పెద్ద థ్యాంక్స్ దేనికో తెలుసా. శ్రీయ గారితో నన్ను యాక్ట్ చేసేలా చేసినందుకు. శ్రీయ గారిని చూస్తే ఆమె అందరి స్టార్స్ తో నటించారు. ఏ ఒక్క స్టార్ ను కూడా వదల్లేదు. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్ అందరితో వర్క్ చేశారు. ఇప్పుడు మీతో నటించడం వల్ల నాకు ఒక స్టార్ డమ్ వచ్చింది. అందరికీ థ్యాంక్స్ అండి. ఎమోషనల్ టైమ్ లో కామెడీ చేసింది ఒక మీతోనే (క్యారెక్టర్ ఆర్టిస్ట్) అనుకుంటా" అని ఫన్నీగా మాట్లాడారు ఉపేంద్ర. దీంతో ఆయన మాటలకు శ్రీయ సరన్ సిగ్గు పడుతూ.. నవ్వుతూ తల దించుకుంది.


Click it and Unblock the Notifications











