చంచల్‌గూడ జైలుకు జానీ మాస్టర్.. ఎన్ని రోజుల రిమాండ్ అంటే?
టాలీవుడ్‌తో పాటు భారతీయ చిత్ర పరిశ్రమలోనే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారం చర్చనీయాంశమైంది. మహిళా అసిస్టెంట్‌పై అత్యాచారంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడిన అభియోగాలపై జానీపై కేసులు నమోదు చేశారు హైదరాబాద్ నార్సింగి పోలీసులు. తనపై ఆరోపణలు వస్తున్న వేళ.. అజ్ఞాతంలోకి వెళ్లిన జానీ మాస్టర్‌ను సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల వివరాల్లోకి వెళితే..
మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు తర్వాత జానీ మాస్టర్ పారిపోవడం కలకలం రేపింది. దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు . పక్కా సమాచారం మేరకు గోవాలో ఓ లాడ్జిలో జానీ మాస్టర్ ఉన్న విషయం తెలుసుకున్న సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు గురువారం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. కేసు దర్యాప్తులో భాగంగా నగరంలోని ఓ రహస్య ప్రాంతంలో జానీ మాస్టర్‌ను విచారించినట్లుగా వార్తలు వస్తున్నాయి.

జానీ మాస్టర్ కేసుపై టాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ రంగంలోకి దిగి వ్యవహారాన్ని పర్యవేక్షిస్తోంది. హీరో మంచు మనోజ్ కూడా ఈ వ్యవహారంపై ఎక్స్ ద్వారా స్పందించారు. మీపై ఇలాంటి ఆరోపణలు రావడంతో నా గుండె ముక్కలవుతోందన్నారు. నిందపడినప్పుడు పారిపోవడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపుతుందని.. తప్పు లేకపోతే పోరాడాలని, తప్పుంటే ఒప్పుకోవాలని మనోజ్ సూచించారు.
తోటి కొరియోగ్రాఫర్లు కూడా జానీ మాస్టర్ వివాదంపై స్పందిస్తున్నారు. ఆట సందీప్ సతీమణి జ్యోతి స్పందిస్తూ... నిందితులు ఏ స్థాయిలో ఉన్నా వదిలిపెట్టకూడదన్నారు. కానీ ఇదే సమయంలో చట్టాలను ఉపయోగించుకుని.. ఓ వ్యక్తి కష్టపడి సంపాదించుకున్న పేరుని, ఇమేజ్‌ను చెడగొట్టాలనుకునే అమ్మాయిల్ని కూడా శిక్షించాలని జ్యోతి సూచించారు. అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారని.. నిజం ఏదో ఒక రోజు బయటికి వస్తుందని జ్యోతి అభిప్రాయపడ్డారు.

కాగా.. విచారణ అనంతరం జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్ట్‌లో హాజరుపరిచారు. పోలీసుల అభియోగాలు, దర్యాప్తు ఆధారంగా న్యాయమూర్తి జానీ మాస్టర్‌కు అక్టోబర్ 3 వరకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఫోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేసేందుకు జానీ తరపు న్యాయవాది ఏర్పాట్లు చేస్తున్నారు. 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో జానీ మాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించాను నార్సింగి పోలీసులు. ఈ నేపథ్యంలో కేసు ఏ మలుపు తిరుగుతుందోనని టాలీవుడ్ వర్గాలు , ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.


Click it and Unblock the Notifications











