ఉప్పెనలో డేంజరస్ పాయింట్.. బుచ్చిబాబు భారతీరాజాలా డీల్ చేశాడు.. చిరంజీవి పొగడ్తల వర్షం
చిరంజీవి ముఖ్య అతిథిగా తన మేనల్లుడు వైష్టవ్ తేజ్ నటించిన ఉప్పెన చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు గురించి చిరంజీవి మాట్లాడుతూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. తమిళ దర్శకుడు భారతీ రాజాతో పోల్చుతూ ఇంకా చిరంజీవి ఏమన్నారంటే..

బుచ్చిబాబు దర్శకత్వ విలువలు గొప్పగా
ఉప్పెన సినిమా చూస్తే దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభ, దర్శకత్వ విలువలు, స్క్రీన్ ప్లేకి ఈ సినిమా ఫర్ఫెక్ట్ ఉదాహరణ. స్క్రీన్ ప్లే అంటే బయటవారికి ఏమీ తెలియదు. స్క్రీన్ ప్లే అంటే మనం అనుకొన్న కథను తెర మీద ఎలా చూపించబోతున్నాం అనేది స్క్రీన్ ప్లే. ఒక్కోసారి డైలాగ్స్‌లో ఉండకపోవచ్చు. కానీ దృశ్యరూపంలో ఎలా చూపించబోతున్నాం. ప్రేక్షకుడిలో ఉత్కంఠ ఎలా రేకేత్తిస్తామనే అంశాలకు ఉప్పెన ఫర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ సినిమాను ఒకసారి వినోదం కోసం.. మరోసారి స్క్రీన్ ప్లే కోసం ప్రతీ ఒక్కరు తప్పకుండా చూస్తారు అని చిరంజీవి అన్నారు.

బుచ్చిబాబు మరో భారతీరాజా
ఉప్పెన కథలో ఎక్కడ పాయింట్‌ను ఓపెన్ చేయాలి. సస్పెన్స్‌ను ఎక్కడ రివీల్ చేయాలి.. కథను ముందుకు.. వెనుకకు తీసుకెళ్తూ స్టోరిని చెప్పే విధానాన్ని చక్కగా చూపించాడు. ఈ సినిమా కోసం బుచ్చిబాబు చాలా హర్డ్ వర్క్ చేశారు. ఈ సినిమా చూస్తే 80, 90 దశకాల్లో తమిళంలో అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడు భారతీరాజా గుర్తుకు వచ్చాడు అని దర్శకుడు బుచ్చిబాబు గురించి చిరంజీవి గొప్పగా మాట్లాడారు.

మట్టి కథలు, గ్రామీణ నేపథ్యంతో
భారతీ రాజా మట్టికథలను, గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రాలను భారతీ రాజా రూపొందించారు. మన కథలు ట్రెండీ, టెక్నికల్ సినిమాల వల్ల దూరమై పోతున్నాయి. ఉప్పెన చూస్తే మళ్లీ మన కథలు, మన నేపథ్యం ఉన్న చిత్రాలు రావాలనే తపన కలిగింది. ఆ కోవలే వస్తున్న చిత్రమే ఉప్పెన అని చిరంజీవి అన్నారు.

ప్రమాదకరమైన పాయింట్‌ను డీల్ చేసిన విధానమే..
ఉప్పెన కథ ఫస్ట్ టైం చెప్పడానికి సుకుమార్, బుచ్చిబాబు వచ్చారు. మీరు ఈ కథ తప్పకుండా వినాలి.. మీ అభిప్రాయం తప్పకుండా కావాలి అని సుకుమార్ అన్నారు. దాంతో వైష్ణవ్ తేజ్ కోసం కదా అని బుచ్చిబాబు కథ చెబుతుంటే ఓపికగా విన్నాను. ఆ తర్వాత మాట పెగల్లేదు. ఏం చెబుతాం. అంతా ఫర్‌ఫెక్ట్‌గా ఉంది. అయితే ఈ చిత్రంలో ఓ ప్రమాదకరమైన పాయింట్ ఎలా కన్విక్షన్‌తో చెబుతారు అనే సందేహం కలిగింది. కానీ ఈ పాయింట్ గురించి మీరు ఆందోళన పడవద్దని సుకుమార్, బుచ్చిబాబు చెప్పారు అని చిరంజీవి తెలిపారు.


Click it and Unblock the Notifications











