ఉప్పెన దర్శకుడికి కాస్ట్లీ పుట్టినరోజు కానుక.. నిర్మాత ఫోన్ చేసి ఆ మాట చెప్పగానే..
2021లో ఇప్పటివరకు విడుదలైన వినిమాల్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమా ఉప్పెన. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఫీనిష్ చేసింది ఈ సినిమా. చాలా రోజుల తరువాత ఒక లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకి వస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద మొత్తంగా సాలిడ్ వసూళ్లను అందుకోగలదని ఒక నమ్మకం వచ్చేసింది నిర్మాతలకు. ఇక ఇటీవల ఫిబ్రవరి 15న డైరెక్టర్ పుట్టినరోజు కావడంతో నిర్మాతలు అతనికి కాస్ట్లీ గిఫ్ట్ ను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.

మొదటి నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్..
సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా ద్వారా మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా సీరియస్ లుక్ లో విజయ్ సేతుపతి షాక్ ఇచ్చాడని వస్తున్న టాక్ పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తోంది. విడుదలైన ట్రైలర్ తోనే సినిమాపై ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది.

దర్శకుడి మీద నమ్మకంతో
సినిమాను మొదట 10 కోట్ల బడ్జెట్ లోపే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ లెక్కలు 17కోట్ల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. దర్శకుడి మీద నమ్మకం వల్ల సుకుమార్ సపోర్ట్ తో నిర్మాతలు ధైర్యం చేశారు. పూర్తిగా కొత్త వాళ్ళతో ఈ స్థాయిలో సినిమాను నిర్మించడం అంటే చాలా రిస్క్ తో కూడుకున్న పని. కానీ మైత్రి మూవీ మేకర్స్ సినిమా మీద నమ్మకంతో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇక సినిమా మూడు రోజుల్లోనే ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేసింది.

ఈజీగా 50కోట్లు..
ఇక సినిమాకు సంబంధించిన బజ్ వల్ల బిజినెస్ కూడా గట్టిగానే పెరిగింది. ఉప్పెన ప్రీ రిలీజ్ బిజినెస్ తో అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు ఈజీగా 50కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకోవడానికి సిద్ధమైంది. సినిమా నైజాంలోనే భారీగక్ లాభాలు అందిస్తోంది. దాదాపు అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. లాభల్లోకి రావడంతో దర్శకుడికి విషెస్ అందించారు

పుట్టినరోజు కానుక
నిర్ణతలైతే దర్శకుడికి పుట్టినరోజు ఒక ఆఫర్ కూడా ఇచ్చారట. ఫిబ్రవరి 15న బుచ్చిబాబు పుట్టినరోజు కావడంతో నీకు ఇష్టమైన కారు కొనుక్కో అని నిర్మాతలు ఫోన్ చేసి చెప్పారట. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బుచ్చిబాబుఆ విషయం చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇక నెక్స్ట్ సినిమాను కూడా దర్శకుడు మైత్రి మూవీ మేకర్స్ తోనే చేస్తున్నాడు. ఆ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











