Don't Miss!
- Finance Google Layoffs: ఉద్యోగులను మళ్లీ తగ్గించిన గూగుల్.. భారతీయ టెక్కీలపై భారీ ప్రభావం..
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
‘ఉప్పెన’ దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్: మొదటి అనుభవాన్ని పంచుకున్న బుచ్చిబాబు
మెగా ఫ్యామిలీకి చెందిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. ప్యూర్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించాడు. ఈ మూవీ ద్వారా కృతి శెట్టి తెలుగు చిత్ర సీమకు పరిచయం అయింది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి తొలిసారి తెలుగు సినిమాలో పూర్తి స్థాయి పాత్రను పోషించాడు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరింత ప్లస్ అయింది. మొత్తానికి ఈ మూవీ భారీ సక్సెస్ అవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇక, 'ఉప్పెన' మూవీ విజయం సాధించడం వల్ల భారీగా లాభ పడిన మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేనీ, రవి శంకర్.. తాజాగా దర్శకుడు బుచ్చి బాబు సనకు ఓ ఖరీదైన బెంజ్ కారును గిఫ్టుగా ఇచ్చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం మైత్రీ కార్యాలయంలో ఆ కారు తాలూకు కీని అతడికి అందించారు. ఇక, తనకు లభించిన గిఫ్ట్‌కు ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడీ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ వెంటనే తన కారులో మొదటి రైడ్‌ను గురువు సుకుమార్‌తో కలిసి పంచుకున్నాడు. వీటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన 'ఉప్పెన' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు, కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేసింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా రూ. 51.52 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. రూ. 30.52 కోట్ల లాభాలను అందుకుంది. ఫలితంగా ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేసింది. ఈ చిత్రం ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. మరీ ముఖ్యంగా ఎక్కువ కలెక్షన్లు సాధించిన మీడియం రేంజ్ చిత్రాల జాబితాలో ఇది రెండో స్థానంలో నిలిచింది. నాన్ బాహుబలి కేటగిరిలో ఏడో స్థానంలో నిలిచింది.