యాభై కోట్ల క్లబ్‌లో ‘ఉప్పెన’: ఇంత కంటే మంచి బహుమతి ఏముందంటూ డైరెక్టర్‌కు మైత్రీ బర్త్‌డే విసెష్
మెగా కాంపౌండ్‌కు చెందిన పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన చిత్రం 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా గత వారం విడుదలైంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాక్‌తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్ షోలతో దూసుకుపోతోంది. తద్వారా కలెక్షన్ల పరంగానూ దుమ్ము దులిపేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం విడుదలైన అన్ని ప్రాంతాల్లో కలిపి రికార్డు స్థాయిలో రూ. 50 కోట్ల గ్రాస్‌ను అందుకుంది.
'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సన నేడు (ఫిబ్రవరి 15) పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీనిని పురస్కరించుకుని ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ మూవీ రూ. 50 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు అందులో పేర్కొంది. అంతేకాదు, 'మా బ్లాక్ బస్టర్ దర్శకుడు బుచ్చిబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. వీకెండ్‌లోనే యాభై కోట్ల గ్రాస్ రాబట్టడం కంటే మంచి బహుమతి ఏముంది' అంటూ పోస్ట్ చేసిందా సంస్థ. దీంతో మెగా హీరో మూవీ మూడు రోజుల్లోనే అరుదైన మైలురాయిని చేరుకుందని అధికారికంగా ప్రకటించినట్లైంది.

ఇదిలా ఉండగా.. 'ఉప్పెన'లో తెలిసిన కథ అయినా.. దాన్ని కొత్త తెరకెక్కించిన దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ విషయంలో అందరూ షాక్ అవుతున్నారు. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతోంది. ఇక, ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌గా నటించింది. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి నెగెటివ్ పాత్రను పోషించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.


Click it and Unblock the Notifications











