‘ఉప్పెన’ రన్ టైం ఎంతో తెలుసా?.. ప్రయోగం ఏమీ చేయలేదుగా!
సుకుమార్ శిష్యుడిగా బుచ్చిబాబు సన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నాడు. మొదటి సినిమా విడుదలకు ముందే బుచ్చిబాబుకు ఫుల్ క్రేజ్ వచ్చింది. అయితే గురువులానే సినిమాల్లో మంచి ఎమోషన్ ఉండేలా, నటుల నుంచి మరింతగా నటన రాబట్టుకున్నాడట. అయితే ఒక్క విషయంలో మాత్రం గురువును ఫాలో అవ్వలేదని తెలుస్తోంది. అదే సినిమా నిడివి విషయం. ఉప్పెన రన్ టైం విషయంలో బుచ్చిబాబు ప్రయోగాలకు పోలేదు.
మామూలుగా సుకుమార్ సినిమాలు లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. దగ్గరదగ్గరగా మూడు గంటల పాటు సినిమా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఒక్కోసారి అది వర్కవుట్ అవుతుంది.. కొన్ని సార్లు బెడిసి కొడుతుంది. కానీ బుచ్చిబాబు మాత్రం అలాంటిప్రయోగాల జోలికి పోకుండా సేఫ్ గేమ్ ఆడేస్తున్నాడు. మొత్తంగా ఉప్పెన నిడివి రెండు గంటల 27 నిమిషాలు వచ్చింది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.

ఉప్పెనకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. నిడివి 147 నిమిషాలు. ఇక ఇప్పటికే ఉప్పెన సినిమా కోసం చేయాల్సిన ప్రమోషన్స్ అన్నీ కూడా చేశారు. ఇంకో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అటు ఇండస్ట్రీలోనూ ఇటు అభిమానుల్లోనూ అందరూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి విజయ్ సేతుపతి, కృతి శెట్టి, వైష్ణవ్ తేజ్ ఏ మేరకు మాయ చేస్తారో చూడాలి.



Click it and Unblock the Notifications











