ఆ రికార్డులో 14ఏళ్ళుగా రామ్ చరణ్ నెంబర్ 1.. వైష్ణవ్ తేజ్ ఉప్పెనతో కొట్టేలా ఉన్నాడు
మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత లాభాన్ని అందిస్తే అంత మంచిది. అందుకే మొదటి సినిమా విషయంలో కొందరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక సినీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చే హీరోలు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో లాభాలను అందుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మొదటి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద అత్యదిక షేర్స్ అందుకున్న వారిపై ఒక లుక్కేస్తే.. అందులో రామ్ చరణ్ నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు. అయితే ఉప్పెనతో వైష్ణవ్ తేజ్ ఆ రికార్డులను బ్రేక్ చేసేలా ఉన్నాడని అనిపిస్తోంది.

14 ఏళ్ళుగా.. అదే స్థానంలో..
మెగా తనయుడు రామ్ చరణ్ నటించిన మొదటి సినిమా చిరుత. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ వద్ద 25.11కోట్ల షేర్స్ ను అందించాడు. ఒక విధంగా సినిమాకు ఇది మంచి లాభమనే చెప్పాలి. 14 ఏళ్ళుగా ఇంతవరకు ఎవరు కూడా వారి మొదటి సినిమాతో ఆ కలెక్షన్స్ ను బ్రేక్ చేయలేకపోయారు.

బెల్లకొండ.. అఖిల్ బాబు..
ఇక రెండవ స్థానంలో ఉన్నాడు అల్లుడు శీను. నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా పరిచయమై ఈ సినిమాతో మొత్తం 24.11కోట్లు షేర్స్ అందుకున్నాడు. ఇక అక్కినేని వారసుడు అఖిల్ మొదటి సినిమా అఖిల్ 20కోట్ల వరకు షేర్స్ ను అందుకుంది. ఈ రెండు సినిమాలకు వివి.వినాయక్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

20 ఏళ్ళ క్రితం..తరుణ్ సినిమా
ఇక 20 ఏళ్ళ క్రితం వచ్చిన తరుణ్ మొదటి సినిమా నువ్వే కావాలి బాక్సాఫీస్ వద్ద అప్పట్లో పెట్టిన పెట్టుబడికి అత్యదిక షేర్స్ అందించిన సినిమా. మొత్తం 19కోట్ల షేర్స్ వచ్చాయి. ఇక నితిన్ మొదటి సినిమా కూడా 17కోట్ల షేర్స్ తో అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక ఆ తరువాత స్థానంలో మారుతి నుతున నటీనటులతో తెరకెక్కిన ఈ రోజుల్లో ఉంది. ఈ సినిమా 17కోట్ల షేర్స్ ను అందించింది.

వైష్ణవ్ తేజ్.. ఉప్పెనతో బ్రేక్ చేస్తాడా?
ఇక ఈ రికార్డులతో చిరుత సినిమాను బ్రేక్ చేసేది ఎవరనేది గత కొంతకాలంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఆ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాపై ప్రస్తుతం బజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. సినిమాకు గనక కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద ఈజీగా 25కోట్ల షేర్స్ ను అందుకుంటుందని టాక్ వస్తోంది. పైగా సినిమా ట్రైలర్ కూడా క్లిక్కయ్యింది. చూడాలి మరి మెగా హీరో తన అన్నయ్య రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో..,


Click it and Unblock the Notifications











