అన్నవరంలో ‘ఉప్పెన’.. హీరోహీరోయిన్ల ప్రత్యేక పూజలు
ప్రస్తుతం ఉప్పెన జోరును ఎవ్వరూ ఆపలేరు. కొత్త దర్శకుడు, కొత్త హీరోహీరోయిన్లు చేసిన మ్యాజిక్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఉప్పెన సినిమాకు నిజంగానే ఉప్పెనలా కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి వీకెండ్‌లో బ్రేక్ ఈవెన్ సాధించేసింది. మొదటి వారాంతంలోనే యాభై కోట్ల గ్రాస్ కొల్లగొట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇలా రోజురోజుకూ ఉప్పెనలా కలెక్షన్లు పెరుగుతూనే ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లోనూ సినిమాను ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలని ఉప్పెన టీం సక్సెస్ మీట్, టూర్‌ను ఏర్పాటు చేసింది. అలా ఉప్పెన విజయోత్సవ వేడుకలు నిన్న రాజమండ్రిలో ఘనంగా జరిగాయి. ఈ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.అయితే ఉప్పెన టీం అటునుంచి అటే దైవ దర్శనానికి వెళ్లింది. తాజాగా ఈ దర్శకుడు, హీరోహీరోయిన్లు అన్నవరం పుణ్యక్షేత్రంలో దర్శనమిచ్చారు.

అన్నవరంలో సత్యనారాయణ స్వామిని ఉప్పెన టీం దర్శించుకుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా, వైష్ణవ్ తేజ్, కృతి శెట్టిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతున్నాయి. సినిమా అంచనాలకు మించి వసూళ్లు చేస్తుండటంతో అందరిలోనూ ఆనందాలు వెల్లివిరుస్తున్నట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఉప్పెన మాత్రం కలెక్షన్లలో కొత్త రికార్డును క్రియేట్ చేసేలానే ఉంది.


Click it and Unblock the Notifications











