ప్రేమకు మరణం లేదు.. కానీ ప్రేమిస్తే మరణమే..! ఆసక్తి రేపుతున్న 'ఊరికి ఉత్తరాన'
ఈ మధ్యకాలంలో తెలుగు చిత్రసీమలో చిన్న సినిమాల హంగామా మరీ ఎక్కువైపోయింది. ఎన్నో చిన్న సినిమాలు వస్తూనే ఉన్నాయి కానీ అందులో కొన్ని మాత్రం వైవిద్యభరితమైన కథాంశంతో థ్రిల్ చేస్తూ ప్రేక్షక లోకానికి కొత్తదనం చూపిస్తున్నాయి. అలాంటి కేటగిరీకి చెందిన సినిమానే 'ఊరికి ఉత్తరాన'.
ప్రేమకు మరణం లేదు.. కానీ ప్రేమిస్తే మరణమే..! అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొని ఈ సినిమా రూపొందిస్తున్నారు. గతంలో వచ్చిన ప్రేమకథా చిత్రాలకు పూర్తి భిన్నంగా, ఆసక్తికర సన్నివేశాలతో ఈ మూవీ తెరకెక్కిస్తున్నామని అంటోంది చిత్రయూనిట్. హోలీ పండగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. హీరో ముఖాన్ని కవర్ చేస్తూ విడుదల చేసిన ఈ లుక్ ఆసక్తికరంగా ఉండటమే గాక, డిఫరెంట్ ఫీలింగ్ కలుగజేస్తోంది.

ఈగల్ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ 'ఊరికి ఉత్తరాన' సినిమాకు సతీష్ పరమ్‌వేద దర్శకత్వం వహిస్తుండగా.. వనపర్తి వెంకటయ్య, హుస్సేన్ నాయక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చిత్రంలో హీరోకు ఫాదర్‌గా మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి నటిస్తున్నారు. అతి త్వరలో ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించనున్నారు.


Click it and Unblock the Notifications











