Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
‘పుష్ప’లో మిస్ ఇండియా: ఆఖరికి ఆమెనే ఫైనల్ చేసిన సుక్కూ.. భారీగానే ఇస్తున్నారు
గత సంక్రాంతికి 'అల.. వైకుంఠపురములో' ఇచ్చిన హిట్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. దీని తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్గా చేస్తోంది. అలాగే, మరో బాలీవుడ్ బ్యూటీని కూడా తాజాగా ఫైనల్ చేసిందట చిత్ర యూనిట్.
అల్లు అర్జున్ కెరీర్లో తొలి పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది 'పుష్ప'. అందుకోసమే ఇందులో అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులను తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఈ మూవీలోని స్పెషల్ సాంగ్ కోసం మాజీ మిస్ ఇండియా ఊర్వశీ రౌటేలాను ఫైనల్ చేసిందట సుక్కూ అండ్ కో. వాస్తవానికి ఎప్పటి నుంచో ఈమె పేరు వినిపిస్తున్నా.. మధ్యలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు దిశా పటానీ, శ్రద్దా కపూర్, కత్రినా కైఫ్ సహా పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఊర్వశీనే తీసుకున్నారట.
ఇక, ఈ పాట కోసం ఊర్వశీ రౌటేలాకు సుమారు రూ. 80 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని అంటున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ మాస్ బీట్ సాంగ్ షూటింగ్ త్వరలోనే జరగనుందనే టాక్ వినిపిస్తోంది. దీనిని టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడని కూడా తెలుస్తోంది. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో విలన్‌గా విజయ్ సేతుపతిని అనుకున్నప్పటికీ.. ఆయన తప్పుకున్నారు. ఈ రోల్ కోసం చిత్ర యూనిట్ అన్వేషణ కొనసాగుతూనే ఉంది.