విరాట్ కోహ్లీని కౌగిలించుకున్న సినీనటి.. అనుష్క ఎక్కడున్నావ్.?
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని సినీ నటి ఊర్వశీ రౌతేలా కౌగిలించుకుంది. అది కుడా స్టేడియంలో అందరూ చూస్తుండగానే. అది చాలదన్నట్లు ఈ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఊర్వశీ రౌతేలా. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వ్యారల్ అవుతున్నాయి. దీనికి సంబందించిన పూర్తి వివరాలు చూద్దామా..

హోరా హోరీ పోరులో ఇండియా విక్టరీ
ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఇటీవల తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడింది భారత క్రికెట్ జట్టు. హోరా హోరీగా జరిగిన ఈ పోరులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ప్రతిభ కనబర్చారు. వీరోచిత పోరాటం చేసిన భారత్.. పాక్ పై చారిత్రాత్మక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అయితే ఈ విజయం చూసి దేశమంతా గర్వపడింది.

ఆనందం తట్టుకోలేక విరాట్ కౌగిలిలో సినీనటి
సినీ నటి ఊర్వశీ రౌతేలాకి క్రికెట్ అంటే మహా ఆసక్తి. దీంతో భారత్ చారిత్రాత్మక విజయాన్ని చూసిన ఆమె ఆనందంతో ఎగిరిగంతేస్తు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విగ్రహాన్ని కౌగిలించుకుంది. దీన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో విరాట్ ని నిజంగానే కౌగిలించుకుందా! అని ఆశ్చర్య పోతున్నారు నెటిజన్లు.

విరాట్ పై అభిమానం చాటుకునేందుకే
ఊర్వశీ రౌతేలా ఇలా విరాట్ విగ్రహాన్ని కౌగిలించుకుంది కేవలం తన అభిమానాన్ని చాటుకుందుకే అని అంటోంది. టీమ్ ఇండియా సారధి విరాట్ కోహ్లీ ఇలాగే మరిన్ని విజయాలు భారత్ కి తెచ్చిపెట్టాలని, ఆయన మద్దతు తెలిపేందుకే ఈ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశానంటోంది ఊర్వశి.

నెటిజన్స్ కామెంట్స్
చూడగానే విరాట్ కోహ్లీ ఒడిలో ఊర్వశి ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుండటంతో ఈ పిక్ పై నెటిజన్స్ కామెంట్స్ హోరెత్తుతున్నాయి. విరాట్ భార్య అనుష్క శర్మను టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. 'అనుష్కా.. ఎక్కడున్నావ్.. ఇక్కడేదో జరుగుతోంది', 'అనుష్క నీకు అన్యాయం జరుగుతోంది', 'అనుష్క గివ్ రెస్పాన్స్' అంటూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పలు తెలుగు, హిందీ సినిమాల ద్వారా ఊర్వశి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











