AGENT: చిరంజీవి బ్యూటీతో అఖిల్ రచ్చ.. ఏజెంట్‌లో ఇది మాత్రం నెక్ట్స్ లెవెల్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను హీరోలుగా పరిచయం చేశారు. కానీ, అందులో కొందరు మాత్రమే ఆరంభంలోనే సక్సెస్ అవగా.. మరికొందరు మాత్రం చాలా ఇబ్బందులు పడ్డారు. అందులో హ్యాండ్సమ్ గాయ్ అక్కినేని అఖిల్ ఒకడు.
నాగార్జున కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. వరుసగా మూడు చిత్రాలూ పరాజయం పాలయ్యాయి. దీంతో అతడి కెరీర్ అర్థాంతరంగా ముగుస్తుందని అంతా అనుకున్నారు. ఈ పరిస్థితుల్లోనే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' అనే సినిమాతో అక్కినేని అఖిల్ మొదటి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.

'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న అక్కినేని అఖిల్... ఆ వెంటనే 'ఏజెంట్' అనే పాన్ ఇండియా చిత్రాన్ని కూడా మొదలు పెట్టాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా స్పై థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతోంది.
దీంతో ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అయితే, మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురు కావడంతో ఈ చిత్రం పలుమార్లు వాయిదా పడిపోయింది. దీంతో అసలు ఇది మొత్తానికే ఆగిపోయిందని కూడా ప్రచారం జరిగింది. కానీ, దీన్ని ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఏజెంట్' మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్‌ను పెట్టినట్లు తెలిసింది. దీనికోసం బాలీవుడ్ బ్యూటీ, బాస్ పార్టీ సాంగ్ ఫేం ఊర్వశీ రౌటేలాను ఎంపిక చేశారని సమాచారం.

దీనికి సంబంధించిన షూట్‌ను ఈ రెండు మూడు రోజుల్లోనే కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో ప్రత్యేకమైన సెట్‌ను కూడా నిర్మించారని టాక్. ఇక, ఈ పాటలో అఖిల్ - ఊర్వశీ స్టెప్పులు, కెమిస్ట్రీ నెక్ట్స్ లెవెల్‌లో ఉండేలా డిజైన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తోన్న 'ఏజెంట్' మూవీలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నారు. దీన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, సురేందర్ 2 సినిమా బ్యానర్లపై సుంకర రామబ్రహ్మం, దీపా రెడ్డి, అజయ్ సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందించాడు. హిప్‌హాప్ తమీజా మ్యూజిక్ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











