బాలీవుడ్ బ్యూటీ కోసం వారణాసికి బన్నీ.. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి ఇలా!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం 'పుష్ప'. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ గంథపు చెక్కల స్మగ్లర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఐదు భాషల్లో రూపొందిస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాల్సి ఉన్నా... కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ వల్ల అది కాస్తా వాయిదా పడింది.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం... ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్‌ను డిసెంబర్ 18 నుంచి ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని వారణాసిలో చిత్రీకరించబోతుంది చిత్ర యూనిట్. అంతేకాదు, ఈ షెడ్యూల్‌లో స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయనున్నారు. ఇందులో అల్లు అర్జున్ - బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఆడిపాడనున్నారు. ఈ సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను సైతం అక్కడ షూట్ చేస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ స్పెషల్ సాంగ్ కోసం ఊర్వశీకి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.

పాన్ ఇండియా లెవెల్‌లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, నెగెటివ్ షేడ్స్ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్‌గా విజయ్ సేతుపతి నటించాల్సి ఉన్నా.. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో ఎవరిని తీసుకోవాలన్న దానిపై చిత్ర యూనిట్ తర్జనభర్జన పడుతోంది. మరోవైపు, ఈ సినిమాలో తొమ్మిది మంది విలన్లు నటిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. కానీ, ఈ విషయంలో క్లారిటీ మాత్రం రావడం లేదు.


Click it and Unblock the Notifications











