NBK109: బాలయ్య కోసం యానిమల్ స్టార్.. ఆమెతో కలిసి ఫ్లైట్‌లో.. పెద్ద ప్లానింగే ఇది!
టాలీవుడ్‌లో ఇప్పుడు సూపర్ డూపర్ ఫామ్‌లో ఉన్న హీరోల్లో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. రెండేళ్ల క్రితం 'అఖండ'తో హిట్ ట్రాక్ ఎక్కిన ఆయన.. ఈ ఏడాది ఆరంభంలోనే 'వీర సింహా రెడ్డి' అనే సినిమాతో కెరీర్‌లో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇక, గత అక్టోబర్‌లో 'భగవంత్ కేసరి'తో వచ్చి ముచ్చటగా మూడో హిట్‌తో హ్యాట్రిక్‌ను నమోదు చేశారు.
వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు తన 109వ సినిమాను బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ మూవీ పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఇక, ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను అధికారికంగా మొదలు పెట్టారు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు.

నందమూరి బాలకృష్ణ - బాబీ కలిసి చేస్తున్న ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారన్న దానిపై చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతో మంది స్టార్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. అయితే, ఈ చిత్రంలో బాలకృష్ణను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్, యానిమల్ ఫేం బాబీ డియోల్ నటిస్తున్నట్లు ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది.
బాలయ్య సినిమాలో బాబీ డియోల్ నటిస్తున్న విషయాన్ని అందులో కీలక పాత్రను పోషిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా తాజాగా రివీల్ చేసింది. ఈ మేరకు ఫ్లైట్‌లో అతడితో కలిసి ప్రయాణం చేస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఊర్వశీ.. NBK109 ఫ్యామిలీలోకి బాబీ డియోల్ వస్తున్న సందర్భంగా తనకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించింది.

బాలీవుడ్‌లో చాలా కాలంగా సత్తా చాటుతోన్న బాబీ డియోల్.. పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మూవీలోనూ ఓ పాత్రను చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే 'యానిమల్' మూవీలోనూ ప్రతినాయకుడిగా నటించి ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు బాలయ్యకు విలన్‌గా మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా.. హై ఓల్టేజ్ యాక్షన్‌తో డిఫరెంట్ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ రావడం లేదు.


Click it and Unblock the Notifications











