Ustaad Bhagat Singh: క్లైమాక్స్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్ .. పవన్ కళ్యాణ్ లుక్ చూశారా?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం కావడంతో ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తమ అభిమాన నటుడు రాజకీయాలకే పూర్తిగా అంకితం అవుతారేమో? సినిమాలలో నటించరేమోనని కోట్లాది మంది పవన్ అభిమానులు బాధపడ్డారు. అయితే ఈ అనుమానాలు పటా పంచలు చేస్తూ పవన్ కళ్యాణ్.. తన చేతిలో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లును విడుదల చేసిన పవర్‌స్టార్.. వచ్చే నెలలో ఓజీని సిద్ధం చేశారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను సైతం కంప్లీట్ చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఉస్తాద్ భగత్ సింగ్ బడ్జెట్ ఎంత?
టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను నిర్మిస్తోంది. పవన్ కళ్యాణ్ వీరాభిమాని హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, చమ్మక్ చంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.

తేరీ రీమేక్‌గా ఉస్తాద్ భగత్ సింగ్
ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఇళయ దళపతి విజయ్ తమిళంలో నటించిన తేరికి తెలుగు రీమేక్‌గా దీనిని నిర్మిస్తున్నారు. అయితే ఒరిజినల్ వెర్షన్‌ను దించేయకుండా దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మారుస్తున్నారు హరీష్. ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. ఉస్తాద్ భగత్ సింగ్‌ను వేగంగా పూర్తి చేసి భారం దించుకోవాలని నిర్ణయించుకున్న పవన్ కళ్యాణ్ బల్క్‌లో డేట్స్ ఇచ్చారు. ఆయన ఉన్న బిజీ నేపథ్యంలో ఈ అవకాశాన్ని హరీష్ శంకర్ సద్వినియోగం చేసుకుని షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు.
మరో హీరోయిన్‌గా రాశీ ఖన్నా
ఉస్తాద్ భగత్ సింగ్‌లో శ్రీలీల మెయిన్ హీరోయిన్‌గా నటిస్తూ ఉండగా.. మరొకరు సాక్షి వైద్య అన్న వార్తలు వచ్చాయి. అయితే దీనికి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది. ఇందులో ఢిల్లీ బ్యూటీ రాశీ ఖన్నా కూడా మరో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలిపింది. ఆమె సెట్‌లో అడుగుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించింది. శ్లోక అనే పాత్రలో నటిస్తున్నారని.. తన పాత్రతో ఈ సినిమాకు మరింత అందాన్ని తీసుకొస్తారని తెలిపింది. దీంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
షూటింగ్‌పై క్రేజీ అప్‌డేట్
ఇదిలాఉండగా.. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అంటూ అభిమానులు గత కొంతకాలంగా చర్చించుకుంటున్నారు. తాజాగా చిత్ర యూనిట్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఉస్తాత్ భగత్ సింగ్ సినిమా క్లైమాక్స్ పూర్తయ్యిందని.. నబకాంత మాస్టర్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను షూట్ చేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ తెలిపింది. డిప్యూటీ సీఎంగా కేబినెట్ సమావేశాలలో పాల్గొంటూ.. హరిహర వీరమల్లు ప్రచారంలోనూ భాగమయ్యారని వెల్లడించింది. అదే జోష్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌ను సైతం పూర్తి చేశారని. ఇది పవన్ కళ్యాణ్ అంకిత భావానికి, కష్టపడి పనిచేసే తత్వానికి నిదర్శనమని మైత్రీ మూవీ మేకర్స్ ప్రశంసలు కురిపించింది.
ఫోటో వైరల్
క్లైమాక్స్ పూర్తయినట్లు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్‌లు కలిసి ఉన్న ఫోటోను మేకర్స్ పంచుకున్నారు. ఇందులో నల్ల కళ్లజోడు పెట్టుకుని, రెడ్ షర్ట్‌లో స్టైలీష్ లుక్‌లో అదరగొడుతున్నారు పవన్ . ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. త్వరలోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్‌పై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











