Ustaad Bhagat Singh: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు హరీష్ శంకర్ క్షమాపణ.. అలా తప్పు జరిగింది అంటూ వివరణ

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్‌తో చోటు చేసుకొన్న వివాదానికి ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ స్వస్తి పలికారు. అయితే అనుకోకుండా జరిగిన పొరపాటుకు చింతిస్తున్నట్టు తాజాగా ట్వీట్ చేశారు. మనోభావాలు దెబ్బ తిన్న మహేష్ ఫ్యాన్స్‌కు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పారు. దాంతో ఈ వివాదాన్ని క్లోజ్ చేసేందుకు చొరవ తీసుకొన్నారు. అయితే మహేష్ బాబు అభిమానులతో వివాదం ఏమిటి? హరీష్ శంకర్ చేసిన ట్వీట్ ఏమిటి? మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమేమిటి? అనే అంశాలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన టీజర్, సాంగ్‌కు అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో భారీ అంచనాలు నెలకొనడమే కాకుండా బాక్సాఫీస్ పరంగా కూడా రికార్డులు క్రియేట్ చేస్తుందనే అంచనాలో పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని BoB రికార్డు బద్దలు కొట్టాలి అంటూ ట్వీట్ చేశారు. అయితే దానిని అంతగా సీరియస్‌గా తీసుకోకుండా తథాస్తు అంటూ ట్వీట్‌తో సమాధానం ఇచ్చారు. దాంతో మహేష్ బాబు అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నాయి. BoB అంటే మహేష్ బాబు బాక్సాఫీస్ రికార్డు అని అర్థం. దాంతో మా హీరో రికార్డును బద్దలు కొడుతామంటే సవాల్ విసురుతారా? అంటూ హరీష్‌పై మహేష్ అభిమానులు అసభ్య పదజాలంతో ట్రోల్ చేశారు.

Ustaad Bhagat Singh Director Harish Shankar

అయితే ఈ వివాదం పవన్, మహేష్ బాబు అభిమానుల ఫ్యాన్స్ వార్‌కు తెర లేపడంతో హరీష్ శంకర్ అలర్ట్ అయ్యారు. ఆయన టీమ్ సూచనలు, సలహాల మేరకు తన తప్పును సరిదిద్దుకొనే ప్రయత్నం చేశారు. వెంటనే సుదీర్ఘమైన లేఖను విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. సెన్సార్, ఇతర జర్నలిస్టులతో చర్చలు, ఇంటర్వ్యూల బిజీ కారణంగా చూసుకోకుండా.. పూర్తిగా చదవకుండా నేను ట్వీట్‌కు రిప్లై ఇచ్చాను. అయితే నా టీమ్ మెంబర్స్ సరిగా చదివి ట్వీట్ చేయమని చెబితే.. నేను చేసిన ట్వీట్‌ వల్ల కొందరు హర్ట్ అయ్యారనే ఉద్దేశంతో వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాను అని హరీష్ తన లేఖలో తెలిపారు.

నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటూ ఎనలేని గౌరవం. వారణాసి సినిమాతో ఆయన పేరుపై లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ అవుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. ఉద్దేశపూర్వకంగా ఆయనను కానీ, ఆయన అభిమానులను హర్ట్ చేయడానికి చేసిన ట్వీట్ కాదు. అనుకోకుండా జరిగిన తప్పిదం. ఆయన బర్త్ డే రోజున పోకిరి గురించి చేసిన ట్వీట్‌ను మీరు చెక్ చేసుకోవచ్చు. దానిని బట్టి ఆయనంటే నాకు ఎంత ఇష్టమో, గౌరవమో తెలుస్తుంది అని హరీష్ అన్నారు.

ఏది ఏమైనా నా ట్వీట్ వల్ల కొందరి మనోభావాలు దెబ్బ తిన్నాయనే విషయం నాకు అర్ధమైంది. అందుకు నా హృదయపూర్వకంగా సారీ చెబుతున్నాను. ఏ సినిమానైనా రికార్డు క్రియేట్ చేయాలని హీరోలు, వారి ఫ్యామిలీలు ఆశిస్తాయి. 10 రోజుల్లో నా సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అలాంటి పోస్టు చేసే విషయంలో కాస్త కామన్ సెన్స్ ఉపయోగించాల్సింది. అనుకోకుండా జరిగిన తప్పిదాన్ని మీరు అర్ధం చేసుకొని.. నా క్షమాపణలను అంగీకరిస్తారని భావిస్తున్నాను అని హరీష్ శంకర్ తన లేఖలో ప్రస్తావించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X